'నవాబ్' కొత్త ట్రైలర్.. తండ్రి సీటు కోసం కొడుకుల పోరు!

Published : Sep 22, 2018, 02:23 PM IST
'నవాబ్' కొత్త ట్రైలర్.. తండ్రి సీటు కోసం కొడుకుల పోరు!

సారాంశం

దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. 

మణిరత్నం మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా చిత్రబృందం మరో ట్రైలర్ ని విడుదల చేసింది.

దీన్ని బట్టి తండ్రి సీటులో కూర్చోడానికి ముగ్గురు కొడుకుల మధ్య జరిగే పోరుతో ఈ సినిమాను తెరకెక్కించినట్లున్నారు. ''నేను మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను.. కానీ తిరిగి తిరిగి నా మైండ్‌లో ఒక్కటే డౌట్ రన్నవుతోంది. పెద్దాయన పోయాడంటే ఎవరికి లాభం'' అంటూ శింబు చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌ మొత్తం యాక్షన్ తో నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పాట కూడా ఆకట్టుకుంటోంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు