పాన్ ఇండియా హీరో అతనొక్కడేనా, నాని కామెంట్స్ పై ట్రోలింగ్.. మరి ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ అంతా ఎవరు ?

Published : Aug 14, 2023, 12:14 PM IST
పాన్ ఇండియా హీరో అతనొక్కడేనా, నాని కామెంట్స్ పై ట్రోలింగ్.. మరి ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ అంతా ఎవరు ?

సారాంశం

నాని దుల్కర్ సల్మాన్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ కావడం మాత్రమే కాదు తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి. 

నేచురల్ స్టార్ నాని సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. అయితే కొన్ని సందర్భాల్లో నాని ఇండస్ట్రీ మంచి కోరి చేసే వ్యాఖ్యలు కూడా వివాదంగా మారుతుంటాయి. ఓటిటి కి వ్యతిరేకంగా మొదట నాని మాత్రమే గళం విప్పాడు. ఆ తర్వాత ఏపీ లో టికెట్ ధరల సమస్యలపై కూడా నాని తనదైన శైలిలో స్పందించాడు.

అయితే తాజాగా నాని మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత చిత్రం ఆగష్టు 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకి నాని, రానా అతిథులుగా హాజరయ్యారు. నాని దుల్కర్ సల్మాన్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ కావడం మాత్రమే కాదు తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి. 

నాని మాట్లాడుతూ.. 'నాకు తెలిసిన నటుల్లో పాన్ ఇండియా నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దుల్కర్ సల్మాన్ మాత్రమే. ఎందుకంటే ఒక హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాస్తాడు.. తమిళ దర్శకుడు రాస్తాడు.. తెలుగు, మలయాళీ దర్శకులు కూడా దుల్కర్ కోసమే కథలు రాస్తారు. ఒక పాన్ ఇండియా హీరోకి కావాల్సింది అదే' అంటూ నాని తెలిపారు. 

నాని చేసిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కారణం అవుతున్నాయి. తనకు తెలిసిన పాన్ ఇండియా హీరో దుల్కర్ మాత్రమే అని నాని అన్నారు. అంటే ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎవరూ నానికి తెలియదా.. వాళ్లంతా పాన్ ఇండియా హీరోలు కాదా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దుల్కర్ పాన్ ఇండియా హీరోనే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నాని ఉంటున్న టాలీవుడ్ లోనే చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. 

ప్రభాస్ మొట్టమొదటగా బాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఆ బాటలో పయనిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే నానిపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. నానికి పాన్ ఇండియా అనే పదం నచ్చదు ఎందుకంటే అతడు ఆ స్థాయికి చేరుకోలేడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నాని చేసిన వ్యాఖ్యలని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. నాని చేసిన వ్యాఖ్యలు ఆ ప్రీరిలీజ్ వేడుకలో దుల్కర్ గురించి చెప్పినవి గా మాత్రమే చూడాలని కామన్ ఆడియన్స్ అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే