నువ్వు మాతోనే ఉన్నావని తెలుసు... అమ్మ శ్రీదేవిని తలచుని జాన్వీ ఎమోషనల్!

Published : Aug 14, 2023, 10:39 AM IST
నువ్వు మాతోనే ఉన్నావని తెలుసు... అమ్మ శ్రీదేవిని తలచుని జాన్వీ ఎమోషనల్!

సారాంశం

శ్రీదేవి జయంతి నాడు జాన్వీ కపూర్ ఎమోషనల్ అయ్యింది. ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేసింది. అలాగే శ్రీదేవి అరుదైన ఫోటో జాన్వీ పోస్ట్ చేసింది.   

ఆగస్టు 13న నటి శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా తల్లిని తలచుకుని జాన్వీ కపూర్ ఎమోషనల్ అయ్యింది. '' హ్యాపీ బర్త్ డే అమ్మ. సినిమా సెట్స్ లో మీ అమ్మ ఒడిలో ఇలా కూర్చోవడం నీకు ఇష్టమని తెలుసు. నీ బర్త్ డే రోజు నేను సినిమా సెట్స్ లో ఉన్నాను. నీ లాగానే అమ్మతో నేను కలిసి ఉండాలని ఎంతో కోరుకున్నాను. అందుకే నేను అనుకుంటాను ఇది నీ 60వ బర్త్ డే కాదు 35వ బర్త్ డే. ఈ ప్రపంచంలో నువ్వు అందరికంటే ప్రత్యేకం. ఇప్పటికీ నువ్వు మాతోనే ఉన్నావని తెలుసు. 

మేము ఎదుగుతున్నామంటే అందుకు కారణం నువ్వే. ఈ రోజు నువ్వు పాయసం, ఐస్ క్రీమ్, కారమెల్, కస్టర్డ్స్ తింటావని భావిస్తున్నాను'' అని జాన్వీ పోస్ట్ పెట్టారు. శ్రీదేవి తన తల్లి ఒడిలో కూర్చున్న ఫోటో పోస్ట్ చేసింది. జాన్వీ కపూర్ పోస్ట్ వైరల్ అవుతుంది. నటిగా శ్రీదేవి ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. జీవించి ఉన్నంత వరకు శ్రీదేవి నటించారు. ఆమె చివరి చిత్రం జీరో. శ్రీదేవి మరణించాక అది విడుదలైంది. 

2018లో శ్రీదేవి దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు మరణించారు. అప్పట్లో ఆమె మరణంపై పలు పుకార్లు వినిపించాయి. ఇక జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ విడుదలకు ముందే శ్రీదేవి మరణించారు. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న శ్రీదేవి కల నెరవేరలేదు. అయితే దఢక్ సెట్స్ కి శ్రీదేవి తరచుగా వెళ్లేవారని సమాచారం. 

జాన్వీ కపూర్ దేవర మూవీతో తెలుగులో అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్ కి జంటగా పాన్ ఇండియా మూవీ చేస్తుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే