ముంబయ్ లో నేచురల్ స్టార్ నాని, సూపర్ ఫాస్ట్ గా 30వ సినిమా షూటింగ్

Published : May 22, 2023, 02:10 PM IST
ముంబయ్ లో  నేచురల్ స్టార్ నాని, సూపర్ ఫాస్ట్ గా 30వ సినిమా షూటింగ్

సారాంశం

నేచురల్ స్టార్ నాని సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. తన సినిమాల షూటింగ్స్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. కొత్త కథలు...వెతుకుతూ.. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేసుకుంటున్నాడు. 

కెరీర్ లో దూకుడు చూపిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి కమర్షియల్ హిట్.. తో పాటు..మంచి కథ ఉన్న సినిమా చేయాలి అన్న ఆశ.. నాకికి దసరాసినిమాతో తీరిపోయింది. దాంతో అదే ఊపుతో నెక్ట్స్ సినిమాలపై కూడా గట్టిగా గురిపెట్టాడు నాని. శ్యామ్ సింగరాయ్ తరువాత నానికి సాలిడ్ సక్సెస్ లేదు. దసరాతో ఆ కోరిక తీరడంతో.. ఇదే ఊపును కంటీన్యూ చేసి.. వరుసగా సక్సెస్ లు సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు నాని. దసరా సినిమాలాగనే ఫార్ములాను ఆలోచించి నెక్ట్స్ హిట్ పై కన్నేశాడు నాని. 

దసరా సినిమా ఇప్పటికీ సాలిడ్‌ రన్‌ను కొనసాగిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్‌ వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో నిలిచింది. ఇక సక్సెస్ ఉంటే చాలు అనుకున్న నానికి సెన్సేషనల్ హిట్  దొరికింది.  అంతే కాదు  ఈ సినిమాతో నాని వంద కోట్ల హీరోగా మారాడు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ప్రస్తుతం నాని శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడితో తన 30వ సినిమా చేస్తున్నాడు.  ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి.. పరుగులు పెడుతోంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్ పక్కాగా సెట్ చేసుకున్నారట. అందులో భాగంగా.. రీసెంట్ గా మూవీ టీమ్.. ఈ సినిమాలోని మేజర్‌ షెడ్యూల్‌ కోసం ముంబై వెళ్లిందట. వారం రోజులకు పైగా అక్కడే షూటింగ్‌ జరుగనుందని సమాచారం.

ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ లో  నానిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఈసీన్స్ మూవీ కథను మలుపుతిప్పేవని అంటున్నారు. ఇక  ఫాదర్‌-డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సీతారామం బ్యూటీ మృణాళ్‌ థాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను  క్రిస్మస్‌  కానుకగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ టీమ్ ప్రకటిచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్