
మంచు మోహన్ బాబు తల్లి ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.
దీనిపై స్పందించిన నెటిజన్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో మంచు లక్ష్మీ పెట్టిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తమిళంలో ఆమె నటించిన 'కాట్రిన్ మోఝి' అనే సినిమా ట్రైలర్ విడుదల కానుండడంతో ఆమె దీనికి సంబంధించి ఓ ట్వీట్ పెట్టింది.
''తమిళంలో నా తొలి సినిమా ట్రైలర్ చూడకుండాఉండలేకపోతున్నా.. కాట్రిన్ మోఝి ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుందని'' ట్వీట్ చేశారు. ఇలాంటి విషాద సమయంలో ఆమె తన సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. నానమ్మ చనిపోయినా.. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఎలా ఉంటున్నావంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు నీ కోసం రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటామంటూ ఘాటు రిప్లయ్ ఇస్తున్నారు. ఇక 'కాట్రిన్ మోఝి' సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'తుమ్హారీ సులు' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జ్యోతిక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా మంచు లక్ష్మీ.. జ్యోతికకు బాస్ పాత్రలో కనిపించనున్నారు.
సంబంధిత వార్తలు..
నానమ్మ గురించి మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్!