కౌశల్ కాబట్టి ఓపికగా ఉన్నాడు.. నేనైతే కొట్టేదాన్ని: నటి కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 20, 2018, 12:42 PM IST
Highlights

బిగ్ బాస్ షోలో సోమవారం నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ ని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ అంతా దాడి చేస్తున్నారు. కావాలనే కౌశల్ ని రెచ్చగొడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి మాధవీలత.

బిగ్ బాస్ షోలో సోమవారం నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ ని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ అంతా దాడి చేస్తున్నారు. కావాలనే కౌశల్ ని రెచ్చగొడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి మాధవీలత.

''మనిషిలో ఎనిమిది రకాల ఈవిల్స్ ఉంటాయి. గొడవ పడేప్పుడు ఒకరి తరువాత ఒకరుగా ప్రశ్నించాలి అలా కాకుండా ఒకేసారి దాడి చేస్తుంటే ఆ ఈవిల్స్ లో ఏదోకటి ఆటోమేటిక్ గా బయటకి వస్తుంటుంది. ఆ సమయంలో ఒకరు కాకుల్లా, రాబందుల్లా, కుక్కల్లా అనే పదాలు వాడుతుంటారు. దీన్ని నేను సమర్ధిస్తున్నాను.

కౌశల్ కాబట్టి అంత ఓపికగా సమాధానం చెబుతున్నాడు. నేనైతే కొట్టేదాన్ని.. రోల్ ఏడవడం నాకు చాలా కామెడీగా అనిపించింది. కౌశల్ తన పిల్లలను చూసుకొని ఏడ్చాడు.. ఆ సమయంలో ఎవరైనా ఓదారుస్తారు. కానీ రోల్ ఏడుస్తూ కౌశల్ నుండి ఓదార్పు ఆశించడమేంటి..? నలుగురు ఓదారుస్తున్నారు సరిపోలేదా..? నేను తన ఎమోషన్ ని తప్పుబట్టడం లేదు.. సిట్యుయేషన్ కరెక్ట్ కాదని అంటున్నా..

ఇక ఇసుక టాస్క్ విషయానికొస్తే.. మొదటిరోజు జరిగిన టాస్క్ రద్దు చేస్తున్నా అని ప్రకటించిన తరువాత రెండో రోజు కంటిన్యూ చేయడమేంటి..? రద్దయిన టాస్క్ నుండి ఫినాలేకి మరో కంటెస్టెంట్ ని ఎలా ఎంపిక చేస్తారు..?'' అంటూ వీడియో ద్వారా ప్రశ్నించింది. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: మరోసారి కౌశల్ తో గొడవ జరుగుతుందా..?

బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కౌశల్ అన్నకే: కౌశల్ ఆర్మీ సభ్యులు!

బిగ్ బాస్2: ఫైనల్స్ లో ఇద్దరు స్టార్ హీరోలు..

బిగ్ బాస్2: ఇక్కడ కాబట్టి బతికిపోయావ్.. కౌశల్ కి తనీష్ వార్నింగ్!

click me!