బిగ్ బాస్2: మరోసారి కౌశల్ తో గొడవ జరుగుతుందా..?

Published : Sep 20, 2018, 12:11 PM ISTUpdated : Sep 20, 2018, 12:12 PM IST
బిగ్ బాస్2: మరోసారి కౌశల్ తో గొడవ జరుగుతుందా..?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో ఈ వారం మొదలైనప్పటి నుండి కౌశల్ తో మిగిలిన హౌస్ మేట్స్ కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ చేసే కామెంట్స్ కి ఎదురుతిరుగుతూ హౌస్ మేట్స్ అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడి చేస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ 2 లో ఈ వారం మొదలైనప్పటి నుండి కౌశల్ తో మిగిలిన హౌస్ మేట్స్ కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ చేసే కామెంట్స్ కి ఎదురుతిరుగుతూ హౌస్ మేట్స్ అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడి చేస్తున్నారు.

నిన్నటివరకు గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా గొడవలు జరిగేలానే ఉన్నాయి. టాస్క్ లో భాగంగా రోల్ రైడా, సామ్రాట్ లకు బిగ్ బాస్ గుడ్లు ఇచ్చి వాటిని కాపాడుకోవాలని చెప్పారు. మిగిలిన హౌస్ మేట్స్ వారి గుడ్లను పగలగొట్టే ప్రయత్నం చేయొచ్చు అలానే సపోర్ట్ కూడా చేయొచ్చు.

ఈ క్రమంలో రోల్, సామ్రాట్ లు జైలులోకి వెళ్లగా.. తనీష్ దానికి లాక్ వేశాడు. దీంతో అసలు లాక్ ఎలా వేస్తారని తనీష్ ని ప్రశ్నించాడు కౌశల్. అలానే గీతా దగ్గరకి వెళ్లి 'ఇద్దరూ గెలవడం ఇష్టం లేకపోతే ఇద్దరి గుడ్లను పగలగొట్టొచ్చా' అని కౌశల్ అడగ్గా.. దానికి ఆమె అది నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చింది. అంటే కౌశల్ కి ఇద్దరూ గెలవడం ఇష్టం లేదు కాబట్టి మరి ఆయన వారి దగ్గరున్న గుడ్లను ఎలా పగలగొడతాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?