
అల వైకుంఠపురంలో, పుష్ప చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అల్లు అర్జున్ కి దక్కాయి. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ ఫెయిల్యూర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అదే సమయంలో తన ఫేమ్ నేషనల్ వైడ్ విస్తరించాడు. పుష్ప హిందీలో విజయంలో సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండితులు డిజాస్టర్ ని డిసైడ్ అయ్యారు. అనూహ్యంగా పుంజుకున్న పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్ళలో దుమ్ము రేపింది. భారీ బాలీవుడ్ చిత్రాలకు షాక్ ఇస్తూ క్లీన్ హిట్ కొట్టింది.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం బాగా పాప్యులర్ అయ్యింది. ఇక సాంగ్స్ ట్రెమండస్ హిట్ సాధించాయి. ఈ క్రమంలో నేషనల్ మీడియా అల్లు అర్జున్ కి గౌరవం ఇచ్చింది. ప్రముఖ మ్యాగజైన్ ఇండియా టు డే కవర్ పేజీ పై అల్లు అర్జున్ ఫోటో వేశారు. ఇక అల్లు అర్జున్ సినిమా జర్నీ వివరిస్తూ ఓ సమగ్ర ఆర్టికల్ పోస్ట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ఈ అరుదైన క్షణాలు పంచుకున్నారు.
ఇక పుష్ప 2 ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 2024 లో విడుదల ప్లాన్ చేస్తున్న టీమ్ భారీగా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ సైతం రూ. 350 కోట్లకు పెంచినట్లు సమాచారం అందుతుంది. పాన్ ఇండియా ప్రమాణాలకు తగ్గట్లు స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేర్పులు చేశారట. వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ తో అల్లు అర్జున్-సుకుమార్ దిగుతున్నారట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.