పరిశ్రమలో విషాదం... ప్రముఖ దర్శకుడు మృతి

By team teluguFirst Published Dec 14, 2020, 4:14 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు పి. కృష్ణమూర్తి ఆదివారం మరణించడం జరిగింది. అనారోగ్య కారణాల చేత కృష్ణమూర్తి మరణించినట్లు సమాచారం అందుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక చిత్రాలు తెరకెక్కించిన కృష్ణమూర్తి ఏకంగా ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు. ఆర్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన కీర్తి గడించడం జరిగింది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పి. కృష్ణమూర్తి ఆదివారం మరణించడం జరిగింది. అనారోగ్య కారణాల చేత కృష్ణమూర్తి మరణించినట్లు సమాచారం అందుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక చిత్రాలు తెరకెక్కించిన కృష్ణమూర్తి ఏకంగా ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు. ఆర్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన కీర్తి గడించడం జరిగింది. 77ఏళ్ల కృష్ణమూర్తి చివరి చిత్రం రామానుజన్. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2014లో విడుదల అయ్యింది. 

 
1975లో వచ్చిన హంస గీత అనే కన్నడ చిత్రంతో  కృష్ణమూర్తి సినిమా జీవితం మొదలైంది. ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుడు భైరవి వెంకటసుబ్బయ్య జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను అందుకుంది. కృష్ణమూర్తికి మొదటి జాతీయ పురస్కారం జీవీ అయ్యర్ దర్శకత్వం వహించిన ‘మాధ్వాచార్య’ చిత్రం వల్ల దక్కింది. ఇక వీరిద్దరూ 1983లో విడుదలైన ఆది శంకరాచార్య , 1986లో తెరకెక్కిన మాద్వాచార్య అలాగే  1989లో విదులైన రామానుజచార్య వంటి చిత్రాలకు వర్క్ చేయడం జరిగింది. 
 
నటనపై ఆసక్తి కలిగిన కృష్ణమూర్తి మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో జాయిన్ కావడం జరిగింది. అనేక థియేటర్ నాటకాలు, నృత్య ప్రదర్శనలకు అవసరమైన సెట్స్ రూపొందించేవారు. అలాగే కృష్ణమూర్తి సంస్కృతం, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళం, మలయాళం, ఫ్రెంచ్, ఆంగ్ల చిత్రాలకు పని చేశారు కృష్ణమూర్తి తమిళంలో ఇందిరా, సంగమం, తెనాలి, కుట్టి, పాండవర్ భూమి, అజాగి, భారతి, జూలీ గణపతి, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి, నాన్ కడావుల్ ఉన్నాయి. కృష్ణమూర్తి మృతి వార్త తెలుసుకున్న పరిశ్రమ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. 
 
click me!