ప్రైజ్‌మనీతో రైతుల అప్పులు తీరుస్తానన్న అరియానా.. నెటిజన్ల ప్రశంసలు

Published : Dec 14, 2020, 01:42 PM IST
ప్రైజ్‌మనీతో రైతుల అప్పులు తీరుస్తానన్న అరియానా.. నెటిజన్ల ప్రశంసలు

సారాంశం

అందరు ఇళ్లు కొనుక్కుంటామన్నారు. అరియానా చెప్పినది మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆమె తనకు వచ్చిన ప్రైజ్‌ మనీతో ఇళ్లు కట్టుకుంటానని చెప్పింది. అయితే ఓ ఐదు లక్షలు మాత్రం రైతులకు విరాళంగా అందిస్తానని చెప్పింది.

ఆదివారం ఎపిసోడ్‌లో అరియానా అందరి మనసులు గెలుచుకుంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె హౌజ్‌లో నిజంగానే అంతే బోల్డ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంది. ఎట్టకేలకు ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో అరియానా ఫైనలిస్ట్ గా ఎంపికైంది. అయితే ఆదివారం ఎపిసోడ్‌ ప్రారంభంలో బిగ్‌బాస్‌ విన్నర్‌కి యాభై లక్షల ప్రైజ్‌మనీ వస్తుందని, అయితే ఆ వచ్చిన డబ్బుని ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నారు నాగ్‌. 

అందుకు అందరు ఇళ్లు కొనుక్కుంటామన్నారు. అరియానా చెప్పినది మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆమె తనకు వచ్చిన ప్రైజ్‌ మనీతో ఇళ్లు కట్టుకుంటానని చెప్పింది. అయితే ఓ ఐదు లక్షలు మాత్రం రైతులకు విరాళంగా అందిస్తానని చెప్పింది. తమ ఊరు అంతారంలోని పొలం కొనుకున్న ఓ ఐదారు మంది రైతులకు తలా యాభై వేల చొప్పున సహాయం అందిస్తానని చెప్పింది. 

దీంతో నాగార్జునతోపాటు ఇంటిసభ్యులు కూడా వాహ్‌ అన్నారు. ఆమెని మెచ్చుకున్నారు. అలాగే అఖిల్‌ కూడా ఓ ఓల్డేజ్‌ హోమ్‌ ఎన్జీవో పెడతానని చెప్పాడు. సోహైల్‌ మాత్రం పది లక్షలు సహాయం కోసం పక్కన పెడతానని, తన ఫ్రెండ్‌ విషయంలో జరిగిన సంఘటన చెప్పాడు. మిగిలినది ఇళ్లు కొనుక్కుంటానని తెలిపాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే