ఆ కంటెస్టెంట్‌కి విజయ్‌ దేవరకొండ మద్దతు.. ఇక విన్నర్‌ అతనేనా?

Aithagoni Raju   | Asianet News
Published : Dec 14, 2020, 02:51 PM IST
ఆ కంటెస్టెంట్‌కి విజయ్‌ దేవరకొండ మద్దతు.. ఇక విన్నర్‌ అతనేనా?

సారాంశం

తాజాగా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ సీజన్‌లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. అతనికి భారీగా ప్రమోషన్‌ తీసుకొచ్చారు. ఆయన మరెవరో కాదు అభిజిత్‌. అభిజిత్‌కి నా ఓటు అని చెప్పారు విజయ్‌. అభిజిత్‌కి బెస్ట్  ఆఫ్‌ లక్‌ తెలిపారు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ షో చివరి దశకు చేరుకుంది. ఇక వారం రోజులే మిగిలి ఉంది. ఇన్ని రోజుల గేమ్‌ ఓ ఎత్తైతే, ఈ వారం రోజుల గేమ్‌ మరో ఎత్తు. ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక, అరియానా ఉన్నారు. ఇక వీరిలో టైటిల్‌ విన్నింగ్‌ పోటీ సోహైల్‌, అభిజిత్‌ మధ్యే ఉంటుందని అంటున్నారు. చాలా మంది ప్రముఖులు అభిజిత్‌, సోహైల్‌ పేర్లు చెప్పారు. 

తాజాగా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ సీజన్‌లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. అతనికి భారీగా ప్రమోషన్‌ తీసుకొచ్చారు. ఆయన మరెవరో కాదు అభిజిత్‌. అభిజిత్‌కి నా ఓటు అని చెప్పారు విజయ్‌. అభిజిత్‌కి బెస్ట్  ఆఫ్‌ లక్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఫోటోని పంచుకున్నాడు. ఇందులో అభిజిత్‌, విజయ్‌ దేవరకొండ, సుధాకర్‌ కోమాకుల, వంటి వారున్నారు. 

వీరింతా కలిసి `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంలో నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులో అభిజిత్‌ మెయిన్‌ హీరోగా కనిపించారు. విజయ్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా విజయ్‌కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. అయితే ఈ ఫోటోని పంచుకుంటూ , `మై బాయ్స్.. ఎల్లప్పుడు వారికి శుభాకాంక్షలు..ఎక్కడైనా, ఏదైనా.. `అని పేర్కొన్నాడు విజయ్‌. అభిజిత్‌కి విజయ్‌ మద్దతు భారీగా ఓట్లు వేసేలా చేస్తుందని అంటున్నారు. మరి ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరో తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్