నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేటెడ్‌.. బిగ్‌ బాస్‌ 5లో ఫస్ట్ మేల్ కంటెస్టెంట్‌ అవుట్‌ ?

Published : Oct 02, 2021, 11:24 PM IST
నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేటెడ్‌.. బిగ్‌ బాస్‌ 5లో ఫస్ట్ మేల్ కంటెస్టెంట్‌ అవుట్‌ ?

సారాంశం

ప్రస్తుతం నామినేషన్లలో లోబో, సిరి, ఆనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా  ఓ లీక్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

బిగ్‌బాస్‌ 5 నాల్గో వారం ముగింపు దశకు చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో ప్రియా, కాజల్‌, సన్నీ, యాంకర్‌ రవిలు సేవ్‌ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగే ఎలిమినేషన్‌ ప్రక్రియలు ఈ నలుగురు సేవ్‌ అయ్యారు. ప్రస్తుతం నామినేషన్లలో లోబో, సిరి, ఆనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా  ఓ లీక్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మేల్ కంటెస్టెంట్‌ అని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండో వారంలోనే నటరాజ్‌ మాస్టర్‌ చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చారు. దీంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత దూరం వచ్చి, తన భార్య ఎంతో ప్రేమతో పంపిస్తే ఏం చేయకుండా వెళ్తే వేస్ట్ అని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 

కానీ నాల్గో వారంలోనే ఆయన ఎలిమినేట్‌ అవుతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మిగిలిన వారితో పోల్చితే ఆయనకు బాగా తక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. ఈ వారం నటరాజ్‌ పర్‌ఫెర్మెన్స్ బాగా లేదనే టాక్‌ కూడా ఉంది. ఆయన అతి చేస్తున్నారని, కొన్ని సార్లు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. అంతేకాదు ఆయనపై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

50 ఏళ్లలో 1000 సినిమాలు, 6 ఏళ్లలో హీరోగా 54 మూవీస్, స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన నటుడు ఎవరో తెలుసా?
రజినీకాంత్ కోసం అట్లీ శిష్యుడు, తలైవర్ 173 కి దర్శకుడు ఎవరో తెలుసా? ఎవరూ ఊహించని కాంబో