సమంత-చైతూ విడాకులు.. సిద్ధార్థ్‌ సంచలన ట్విట్‌.. వైరల్‌

Published : Oct 02, 2021, 09:33 PM IST
సమంత-చైతూ విడాకులు.. సిద్ధార్థ్‌ సంచలన ట్విట్‌.. వైరల్‌

సారాంశం

సమంత, చైతూ విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పెళ్లి అంటే చావుతో పోల్చి, విడాకులను పునర్జన్మతో పోల్చారు. తాజాగా సమంత మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌ స్పందించారు. 

సమంత, నాగచైతన్య విడాకుల విషయం టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ సినీ ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. సంచలనంగా మారింది. వీరి డైవర్స్ పై సినీ వర్గాలు అవాక్కవుతున్నాయి. అక్కినేని అభిమానులు, సమంత ఫ్యాన్స్ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇది నిజం కాకుండా ఉంటే బాగుండూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

సమంత, చైతూ విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పెళ్లి అంటే చావుతో పోల్చి, విడాకులను పునర్జన్మతో పోల్చారు. తాజాగా సమంత మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌ స్పందించారు. ఆయన పరోక్షంగా సమంతపై కామెంట్‌ చేశారు. 

`స్కూల్‌లో మా టీచర్‌ నేర్చించిన తొలి పాఠం. మోసం చేసేవాళ్లు ఎప్పుడు బాగుపడరు. నీ విషయంలో ఏమైంది?` అని ప్రశ్నించారు సిద్ధార్థ్‌. అయితే తన ట్వీట్‌లో సమంత పేరుని పేర్కొనలేదు. కానీ సిద్ధార్థ్‌ మాత్రం సమంతని ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు అంటున్నారు. ఇందులో కొందరు సిద్దార్థ్‌కి సపోర్ట్ చేస్తుంటూ, మరికొందరు నెగటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే చైతూ కంటే ముందు సమంత.. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్‌ కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేసింది సమంత. అంతేకాదు సిద్ధార్థ్‌, సమంత కలిసి `జబర్దస్త్` సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య లవ్‌ బాగా పెరిగిందని, వీరిద్దరు మ్యారేజ్‌ కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సడెన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు. 

ఈ సందర్భంగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. తను కూడా `సావిత్రి` లాగే ఇరుక్కుపోయానని, కానీ లక్కీగా త్వరగా తెలుసుకుని దాన్నుంచి బయట పడ్డానని తెలిపింది సమంత. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. సిద్ధార్థ్‌తో బ్రేకప్‌ తర్వాత చైతూకి దగ్గరైంది సమంత. వీరిద్దరు డేటింగ్‌ చేసి 2016లో తమ ప్రేమకి ఎస్‌ చెప్పుకున్నారు. పెళ్లికి పెద్దలను ఒప్పందం కుదుర్చుకుని 2017లో అక్టోబర్‌ 6,7తేదీల్లో క్రిస్టియన్‌, హిందూ సంప్రాదాయల ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు