షణ్ముఖ్‌, సిరిలు చేసిన పనికి పచ్చి మిర్చి తినిపించిన బిగ్‌బాస్‌.. ప్రియాంక దృష్టి మొత్తం దానిపైనే ఉందట..

Published : Oct 02, 2021, 11:06 PM IST
షణ్ముఖ్‌, సిరిలు చేసిన పనికి పచ్చి మిర్చి తినిపించిన బిగ్‌బాస్‌.. ప్రియాంక దృష్టి మొత్తం దానిపైనే ఉందట..

సారాంశం

ఫస్ట్ ఉత్కంఠ భరితంగా సాగే నామినేసన్‌కి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఈ రోజు ఎపిసోడ్‌లో నాలుగురు సేవ్‌ అయ్యారు. ప్రియా, రవి, కాజల్‌, సన్నీ సేవ్‌ అయినట్టు నాగార్జున తెలిపారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నామినేషన్‌లో సిరి, లోబో, అనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. 

బిగ్‌బాస్‌5 శనివారం కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా, మరికాస్త ఉత్కంఠగా సాగింది. ఈ వారంలో కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేసిన వారికి నాగార్జున శనివారం క్లాస్‌ పీకాడు. వారి తప్పులు తెలుసుకునేలా చేశాడు. మరోసారి రిపీట్‌ కాకుండా చూసుకోవాలని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ సారి నాలుగురిని సేవ్‌ చేశాడు నాగార్జున. 

ఫస్ట్ ఉత్కంఠ భరితంగా సాగే నామినేసన్‌కి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఈ రోజు ఎపిసోడ్‌లో నాలుగురు సేవ్‌ అయ్యారు. ప్రియా, రవి, కాజల్‌, సన్నీ సేవ్‌ అయినట్టు నాగార్జున తెలిపారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నామినేషన్‌లో సిరి, లోబో, అనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలబోతుంది. 

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో మొదట క్లాస్‌ పీకే కార్యక్రమంలో జెస్సీ తన తప్పులను ఒప్పుకున్నారు. కెప్టెన్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఆయనకు ఫనిష్‌మెంట్‌ వేయడంతో నాగ్‌ వదిలేశాడు. కానీ నామినేషన్‌లో బాగా అరిసిన లోబోకి గట్టిగానే క్లాస్ పీకాడు నాగ్‌. ఆ క్లిప్‌ చూపించి మరి ఆయనకు వార్నింగ్‌ ఇచ్చాడు. బస్తీ నుంచీ వచ్చిన అనే సింపతీ కార్డ్ ని వాడొద్దన్నారు. అలాగే షణ్ముఖ్‌, సిరిలకు కూడా క్లాస్‌ పీకాడు. వెయిట్‌ లాస్‌ లో చాలా తక్కువ ప్రదర్శన కనిపించిన వీరికి పచ్చిమిర్చీలు తినే ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. అంతేకాదు షణ్ముఖ్‌ కూర్చొని కబుర్లు చెబుతున్నావని ఇకనైనా ఈ మిర్చీలు తిని ఫైర్‌ వస్తుందని గేమ్‌ ఆడతావని ఆశిస్తున్నట్టు నాగ్‌ చెప్పారు. 

మరోవైపు ఐదు యాప్లు ఇచ్చి ఇంటిసభ్యుల్లో ఎవరికి ఏది ఇస్తారో చెప్పండన్నారు నాగ్‌. ఇందులో చాలా వరకు ప్రియాంక సింగ్‌కి అటెన్షన్‌ గ్రాస్ప్ యాప్ ని ఇచ్చారు. హౌజ్‌లో అబ్బాయిలు ఉన్నప్పుడు ఒకలా బిహేవ్‌ చేస్తుందని, లేనప్పుడు మరోలా ఉంటుందన్నారు. అంతేకాదు ఆమె నడిచే విధానాన్ని కూడా చేసి చూపించారు ఆటపట్టించారు. ఆకర్షించాలనే తపన తనలో ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు లోబోకి మైండ్‌ వాడాలనే యాప్ ఇచ్చారు. వారమంతా బాగానే ఉంటాడని, నామినేషన్లలో మాటలు జారిపోతాడని తెలిపారు. 

ఇందులో శ్రీరామ్‌, హమీదల మధ్య జరిగిన గిటార్‌ని చేసి చూపించి ఆటపట్టించాడు నాగార్జున. శుక్రవారం ఎపిసోడ్‌లో శ్రీరామ్‌ .. హమీద వద్ద గిటార్‌ వాయిస్తూ పాటపాడారు. దీనికి ఫిదా అయ్యింది. తాజాగా స్టేజ్‌పై గిటార్‌తో అదే పాటని పాడారు నాగ్‌. దీంతో లవ్‌ ఫీలింగ్‌ కలిగిందని తెలిపింది. మరోవైపు నటరాజ్‌ మాస్టర్, విశ్వ, రవి, లోబోల మధ్య నత్త, నక్క టాపిక్‌ వచ్చింది. ఇది కాసేపు నవ్వులు పూయించింది. అంతేకాదు జెస్సీ చాలా సీరియస్‌ అయ్యాడు. రవి తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం ఆపాలని, ఆయనతోపాటు ఇతరులకు కూడా వార్నింగ్‌ ఇచ్చాడు జెస్సీ. తన ఆట తాను ఆడతానని తెలిపారు. 

మరోవైపు లోబో విషయంలో తాను ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నానని ప్రియా చెప్పిన నేపథ్యంలో హౌజ్‌లో అందరు సేఫ్‌ అని తెలిపారు నాగ్‌. అంతేకాదు హౌజ్‌లో ఉన్న వారందరూ సమానమే అని లోబో విషయంలో పేర్కొన్నాడు. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్‌ సప్పగానే సాగిందని చెప్పొచ్చు. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా నెలకొంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి