గోదావరిలో విజయనిర్మల అస్థికలు నిమజ్జనం.. నరేష్ చేతులమీదుగా!

Published : Jul 04, 2019, 08:55 PM IST
గోదావరిలో విజయనిర్మల అస్థికలు నిమజ్జనం.. నరేష్ చేతులమీదుగా!

సారాంశం

ఇటీవల బహుముఖ ప్రజ్ఞాశాలి నటి విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. 

ఇటీవల బహుముఖ ప్రజ్ఞాశాలి నటి విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. నటిగా, దర్శకురాలిగా విజయ నిర్మల ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారు. అత్యధిక చిత్రాలని తెరకెక్కించిన దర్శకురాలిగా గిన్నిస్ రికార్డుని కూడా సొంతం చేసుకున్నారు. ఆమె మరణంతో కృష్ణ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

ఆమె మరణానంతరం జరగాల్సిన కార్యక్రమాలని కొడుకుగా నరేష్ చేస్తున్నాడు. గురువారం రోజు నరేష్ రాజమండ్రి వెళ్లి శాస్త్రం ప్రకారం విజయనిర్మల అస్థికలని గోదావరిలో నిమజ్జనం చేశాడు. కోటి లింగాల ఘాట్ వద్ద నరేష్ ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. 

నరేష్ సన్నిహితులు, నటుడు గౌతమ్ రాజు నరేష్ తో కలసి రాజమండ్రికి వెళ్లారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. పని మనిషి దగ్గర నుంచి యజమాని వరకు తన తల్లి అందరిని సమభావంతో చూసేవారని అన్నారు. ఆమె నుంచే తాను కూడా సంస్కారం నేర్చుకున్నానని నరేష్ తెలిపాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?