వరంగల్ నగరంలో రామ్, పూరి జగన్నాథ్ క్రేజీ ప్లాన్!

Published : Jul 04, 2019, 07:48 PM IST
వరంగల్ నగరంలో రామ్, పూరి జగన్నాథ్ క్రేజీ ప్లాన్!

సారాంశం

హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది.

హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. 

ప్రస్తుతం తెలంగాణాలో బోనాలు జరుగుతున్నాయి. బోనాలు సీజన్ ని ఇస్మార్ట్ చిత్ర యూనిట్ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోంది. 'ఇస్మార్ట్ బోనాలు' పేరుతో వరంగల్ నగరంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జులై 7న వరంగల్ లో హైగ్రీవాచారి మైదానంలో ఇస్మార్ట్ బోనాలు జరగనున్నాయి. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరి, రామ్ ఇద్దరికీ కీలకం కానుంది. ఇటీవల వీరిద్దరికి సరైన సక్సెస్ లేదు. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు