'కల్కి' బాలకృష్ణ కోసం కాదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Published : Jul 04, 2019, 08:29 PM IST
'కల్కి' బాలకృష్ణ కోసం కాదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

సారాంశం

రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. 

రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. గతంలో కల్కి చిత్రం కథని బాలకృష్ణ కోసం సిద్ధం చేశారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలపై ప్రశాంత్ వర్మ తాజగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

ఈ కథని బాలకృష్ణ కోసం రూపొందించలేదు. ఈ చిత్రం కోసం బాలకృష్ణ గారిని హీరోగా కూడా ఎప్పుడూ అనుకోలేదు. కథ సిద్ధం చేయడం, రాజశేఖర్ గారు ఓకే చేయడం చక చకా జరిగిపోయాయని ప్రశాంత్ వర్మ తెలిపాడు. బాలయ్య కోసం తన వద్ద ఓ కథ ఉన్నట్లు కూడా ప్రశాంత్ వర్మ తెలిపాడు. 

గతంలో బాలకృష్ణ  కల్కి టైటిల్ తో సినిమా తీయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రశాంత్ వర్మ అదే టైటిల్ తో కథ సిద్ధం చేయడంతో బాలయ్య కోసం అంటూ రూమర్లు మొదలయ్యాయి. 

మొత్తంగా అ!, కల్కి చిత్రాలతో తాను మంచి కాన్సెప్ట్ లతో సినిమా చేసే దర్శకుడినని ప్రశాంత్ వర్మ నిరూపించుకున్నాడు. ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రం ఏ జోనర్ లో ఉండబోతోందో మరి!

 

 

PREV
click me!

Recommended Stories

Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?