Akhanda:'అఖండ' పై బాలయ్య కుమార్తె బ్రాహ్మణి కామెంట్

Surya Prakash   | Asianet News
Published : Dec 07, 2021, 04:52 PM IST
Akhanda:'అఖండ' పై బాలయ్య కుమార్తె  బ్రాహ్మణి కామెంట్

సారాంశం

ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. బాలకృష్ణ లుక్ .. ఆయన యాక్టింగ్ కి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

'అఖండ' సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ స్పీడు చూసి ట్రేడ్ పండితులు అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా బాలయ్య ఇక వయస్సు అయ్యిపోయింది. దుకాణం సర్దేయచ్చు అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తోంది.  అఖండ సినిమా 5 రోజుల్లోనే 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా కలెక్షన్స్ చూసిన కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు

'అఖండ' సినిమా చూసిన వాళ్లంతా చాలా కాలం తరువాత మళ్లీ బాలకృష్ణకి తగిన సినిమా పడిందని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ ఇంతవరకూ చేస్తూ వచ్చిన పవర్ఫుల్ పాత్రల వరుసలో అఖండ ముందువరుసలో వచ్చి కూర్చుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అఘోరగా బాలకృష్ణ తన విశ్వరూపం చూపించారని అంటున్నారు.   'అఖండ'ను చూసిన వాళ్లంతా ఈ సినిమా టీమ్ ని ఎంతగానో అభినందిస్తున్నారు. బాలకృష్ణ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also read Akhanda: ఎదిరించి నిలిచిన బాలయ్య...!

తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కూడా తన స్పందనను తెలియజేశారు. 'అఖండ' సినిమా అద్భుతంగా ఉంది. అప్పుడు తాతగారు .. ఇప్పుడు నాన్నగారు సినిమా పరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలకమైన పాత్రను పోషించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంది. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కూడా డెఫినెట్ గా ఈ సినిమాను చూడాలి. ఈ సందర్భంగా మా మదర్ ను .. ఫాదర్ ను కంగ్రాట్యులేట్ చేయాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Also read Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి
 

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్