
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Naturalstar Nani) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రోల్ లోనైనా ఫర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తాడు. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) తర్వాత వస్తున్న మూవీ ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. నజ్రియా నజిమ్ ( Nazriya Nazim) నానీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సుందర్ ప్రసాద్ గా నానీ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం నాని ఫ్యాన్స్.. తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా చిత్రీకరణ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నాని పుట్టిన రోజు సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ‘యువ సుందరరుడికి.. బర్త్ డే హోమం’ పేరిట విడుదలైన ఈ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’లో నాని విసుగెత్తిన బ్రహ్మణ పాత్రలో కనిపించాడు. ఈ గ్లింప్స్ వీడియోలో నాని తన జాతకంలో పేర్కొన్న విధంగా ప్రాణహాని కారణంగా అంతులేని హోమాలను నిర్వహించాల్సి వస్తుంది. కానీ అలాంటి వాటిపై సుందర్ (నాని)కి ఎలాంటి నమ్మకం లేనట్టుగా ఉంటాడు. హోమాలతో ఎంతో విసిగిపోతాడు. ఇప్టటి వరకు హాస్యాస్పదంగా జరిగిన ఈ ‘బర్త్ డే హోమం’ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రోహిణి మరియు వికె నరేష్ అతని తల్లిదండ్రులుగా నటించారు. రోహిణి గతంలోనూ ‘జెంటిల్ మెన్’ ‘అలా మొదలైంది’ సినిమాల్లో నానికి మదర్ క్యారెక్టర్ రోల్ చేసింది. నజ్రియా ఫహద్ ఈ చిత్రంలో కథానాయిక. నదియా, రాహుల్ రామకృష్ణ, సుహాస్ మరియు హర్షవర్ధన్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది. జూలై 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా నికేత్ బొమ్మి, ఎడిటర్ గా రవితేజ గిరిజాల పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న 'అంటే సుందరానికి' ఆర్ట్ డైరెక్షన్ ను లతా నాయుడు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, హసిత్ గోలి, భరద్వాజ్, నృత్య కొరియోగ్రఫీ శేఖర్ VJ, విశ్వ రఘు సహకరిస్తున్నారు.
మరోవైపు నాని కూడా శ్యామ్ సింగరాయ్ మూవీ ఇచ్చిన జోష్ లో దూసుకుపోతున్నాడు. ‘అంటే.. సుందరానికీ’(Ante Sundaraniki) మూవీపై మరింత శ్రద్ధ పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ పనులు పూర్తైనట్టు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్, గ్లిమ్స్ కు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇటీవలే నాని, కీర్తి సురేష్ ( Keerthy Suresh) ల కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘దసరా’(Dasara Movie) ఫూజాకార్యక్రమం కూడా పూర్తయ్యింది. రెగ్యూలర్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు దసరా టీం. ఈ మూవీని కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాగైతే నాని ఫ్యాన్స్ కు ఈ ఏడాది పండగే..