
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంటెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఇష్టపడని వారు ఉండరూ.. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు కేటీఆర్. పవన్ కల్యాణ్ తొలి ప్రేమ సినిమా తాను కాలేజీ రోజుల్లు చాలా సార్లు చూశానన్నారు మంత్రి కేటీఆర్. అప్పటి నుంచి ఇప్పటి భీమ్లా నాయక్ వరకూ దాదాపు 26 సంవత్సరాలు.. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు అన్నారు కేటీర్.
ఇదే పోలీస్ గ్రౌండ్ లో చరణ్ సినిమా ఈవెంట్ కు తాను వచ్చానని.. అప్పుడు చరణ్ గురించి మాట్లాడుతూ.. నాన్న మెగాస్టార్.. బాబాయి పవర్ స్టార్ అని అనగానే.. ఇప్పుడు వచ్చినంత రెస్పాన్స్ అప్పుడు కూడా వచ్చిందన్నారు కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నో అద్భఉతమైన సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.
అంతే కాదు ఆంథ్రాలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నట్టుగా.. ఇప్పుడు మన రాష్ట్రాంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల దగ్గర గోదావరి జిల్లాల మాదిరిగా మంచి లొకేషన్లు వచ్చాయని.. ఇక్కడ కూడా షూటింగ్ అద్భుతంగా చేసుకోవచ్చు అన్నారు కేటీఆర్. ఇక హైదరాబాద్ ను ఇండియన్ సినిమా హబ్ గా మార్చడంతో తమ వంతు సహాయం ఎప్పుడూ అందిస్తామన్నారు కేటీజర్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించారు. సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించిన భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.
మొదటి నుంచి పవర్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25న.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఈమూవీ 5 షోలకు అనుమతి లభించింది. రెండు వారాల పాటు రోజుకు 5 షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది.
భీమ్లా నాయక్ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్.. ఫస్ట్ గ్లింప్స్, టీజర్స్, ట్రైలర్ వరకూ అన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఈ వీడియోస్ ను కోట్ల వ్యూస్ తో సూపర్ హిట్ చేశారు. సినిమాను సెన్సేషన్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాస్తంగా పవర్ స్టార్ అభిమానులతో పాటు రానా దగ్గుబాటి అభిమానులు కూడా భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తన్నారు.