విజయ్ ‘లియో’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ పై స్ట్రాంగ్ బజ్.. ఆ ప్రత్యేకమైన రోజునే రాబోతోంది

By Asianet News  |  First Published May 30, 2023, 1:09 PM IST

విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపుదద్దుకుంటున్న చిత్రం ‘లియో’. ప్రస్తుతం ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడా అని చూస్తుండగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
 


తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) - లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘లియో’. వీరిద్దరి కాంబోలో గతంలో ‘మాస్టర్’ చిత్రం విడుదలైన వచ్చిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన  ‘ఖైదీ’, ‘విక్రమ్’ బ్లాక్ బాస్టర్ హిట్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం Leoపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే పలు మేజర్ షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. లోకేష్ ఎక్కడా ఆలస్యం లేకుండా చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం టైటిల్  అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ చిత్రం నుంచి అప్పుడప్పుడు నెట్టింట క్రేజీ బజ్ వినిపిస్తోంది. 

Latest Videos

అయితే, చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసే పనిలో ‘లియో’ యూనిట్ నిమగ్నమైందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ అప్డేట్ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా, జూన్ 22న విజయ్ దళపతి పుట్టిన రోజు ఉండటంతో ఆ ప్రత్యేకమైన రోజున ఫస్ట్ గ్లింప్స్ రానుందని బజ్ క్రియేట్ అయ్యింది. 

ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాబోయే ఫస్ట్ గ్లింప్స్ తో మరింత హైప్ క్రియేట్ కానుందనేది అర్థమవుతోంది. గ్లింప్స్ సుమారు నిమిషం ఉండేలా కట్ చేసి విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ‘లియో’ రాబోతుండటంతో ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు దళపతి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అందనున్నట్టు తెలుస్తోంది. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని అంటున్నారు. ఒకటి గ్యాంగ్ స్టర్ గా, మరోకటి చాక్లెట్ తయారు చేసి వ్యక్తి పాత్రలోనూ కనిపించబోతున్నారని టాక్. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై చిత్రాన్ని రూ.300 కోట్ల వరకు పెట్టుబడితో నిర్మిస్తున్నారు. మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో  సంజయ్ దత్ , గౌతమ్ మీనన్ ,మిస్కిన్ , మన్సూర్ అలీఖాన్ , ప్రియా ఆనంద్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

click me!