నానికి తన రుచి చూపించిన టేస్టీ తేజ.. వాడుకోవడంలో ఇది మరో రకం

Published : Nov 10, 2023, 11:20 PM ISTUpdated : Nov 10, 2023, 11:23 PM IST
నానికి తన రుచి చూపించిన టేస్టీ తేజ.. వాడుకోవడంలో ఇది మరో రకం

సారాంశం

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన వారిలో పాపులర్‌ అయ్యాడు టేస్టీ తేజ. అయితే తన టేస్ట్ ఏంటో ఇప్పుడు నేచురల్‌ స్టార్‌ నానికి చూపించారు.

బిగ్‌ బాస్‌ షోతో వచ్చిన క్రేజ్‌, పాపులారి వాడుకుంటున్నారు సినిమా వాళ్లు. నేచురల్‌ స్టార్‌ నాని సైతం దీన్ని ఫాలో అవుతున్నాడు. తన సినిమాని ప్రమోట్‌ చేసుకునేందుకు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ని వాడుకుంటుండటం విశేషం. బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో పాపులర్‌ అయ్యాడు టేస్టీ తేజ. ఫుడ్‌ బ్లాక్‌ చేస్తూ యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన టేస్టీ తేజ.. బిగ్‌ బాస్‌ షోలో పాల్గొని అలరించాడు. కామెడీని పంచుతూ మెప్పించాడు. ఏడో సీజన్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. 

గత వారం టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన ఎలిమినేషన్‌పై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తేజ చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ దాడికి తెగబడ్డారు. కానీ వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా తనకు వచ్చిన క్రేజ్‌, పాపులారిటీని సరైన విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు తేజ. తన ఫుడ్‌ బ్లాగ్‌ని మరింతగా విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందులో భాగంగా తన ఫుడ్‌ని హీరో నానికి రుచి చూపించారు. అయితే తేజ క్రేజ్‌ని వాడుకోవాలనుకుంటుంది `హాయ్‌ నాన్న` టీమ్‌. 

తాజాగా నాని, తేజ కలిసి ఓ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఇందులో తేజ తాను తీసుకొచ్చిన బిర్యానీని నానికి రుచి చూపించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చిట్‌చాట్‌ చేశారు. అనేక కబుర్లు మాట్లాడుకున్నారట. వీటికి సంబంధించిన వివరాలను టీమ్‌ తెలియజేయబోతుంది. తాజాగా ఈ ఇద్దరు కలిసి ఫుడ్‌ తింటున్న ఫోటోలను షేర్‌ చేశారు. అవి ఆకట్టుకుంటున్నాయి. అయితే తేజ పాపులారిటీని వాడుకోవాలని `హాయ్‌ నాన్న` టీమ్‌ ఇలా చేయడం ఆశ్చర్యపరుస్తుంది. తేజ రేంజ్‌ని పెంచుతుంది. మరి ఇందులో వీరు ఏం మాట్లాడుకున్నారు, నాని ఏం చెప్పాడనేది ఆసక్తికరం. 

`హాయ్‌ నాన్న` చిత్రంలో నాని హీరోగా నటిస్తుండగా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తుంది. శృతి హాసన్‌ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు. నాని రంగంలోకి దిగారు. మొన్న ఆయన `ఇండియా టుడే` రౌండ్‌టేబుల్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..