రాంచరణ్ ని ఫ్రీగా వాడేశారు.. ఇప్పుడు ఎన్టీఆర్ ని.. ఈ జిమ్మిక్కులు అవసరమా ?

Published : Nov 10, 2023, 09:05 PM IST
రాంచరణ్ ని ఫ్రీగా వాడేశారు.. ఇప్పుడు ఎన్టీఆర్ ని.. ఈ జిమ్మిక్కులు అవసరమా ?

సారాంశం

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 చిత్రం ఆదివారం రోజు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నార్త్ లో వసూళ్ల ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. 

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 చిత్రం ఆదివారం రోజు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నార్త్ లో వసూళ్ల ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ లో కండల వీరుడికి అంత పట్టు లేదు. కానీ ఈ సారి హంగామా చూస్తుంటే మంచి వసూళ్లే నమోదయ్యేలా ఉన్నాయి. అయితే పాజిటివ్ టాక్ అవసరం. 

సినిమాకి పబ్లిసిటీ పెంచేందుకు మేకర్స్ ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. ఏమాత్రం సంబంధం లేని పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ మధ్య సంబంధం లేని హీరోల పేర్లు చర్చలో ఉండేలా సినిమా రిలీజ్ కి ముందు హంగామా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం అఖిల్ ఏజెంట్ చిత్రానికి, రాంచరణ్ ధృవకి ఎదో కనెక్షన్ ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. రాంచరణ్ ని వాడుకున్నారు. 

కానీ ఏజెంట్ ఫలితం బెడిసికొట్టింది. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో చిత్రం విషయంలో కూడా ఇదే తరహా పుకార్లు వచ్చాయి. లోకేష్ కనకరాజ్ ఎల్ సి యు లో రాంచరణ్ కూడా భాగం కాబోతున్నారని.. లియో చిత్రంలో రాంచరణ్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ ముందు రోజు వరకు కూడా పుకార్లు జోరుగా నడిచాయి. కానీ చిత్రంలో అలాంటి జాడ ఏమాత్రం కనిపించలేదు. 

తెలుగులో సినిమాకి హైప్ పెంచడం కోసమే ఆ పుకార్లు సృష్టించారు. ఇప్పుడు ఇదే తరహా ప్రయత్నం టైగర్ 3 చిత్రానికి కూడా జరుగుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో టైగర్ 3 తెరకెక్కుతోంది. ఈ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ పేరుతో ఈ చిత్రాలు తెరకెక్కిస్తోంది. భవిష్యత్తులో టైగర్, పఠాన్, వార్ చిత్రాలని కలుపుతూ భారీ చిత్రాలు చేసే ఆలోచనలో ఉంది. 

ఆల్రెడీ సల్మాన్ పఠాన్ లో గెస్ట్ గా కాసేపు అలరించాడు. ఇప్పుడు టైగర్ 3లో షారుఖ్ తో పాటు హృతిక్ కూడా కాసేపు సందడి చేస్తాడట. వార్ 2లో ఎన్టీఆర్ కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే. షారుఖ్, హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా టైగర్ 3లో కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. రాంచరణ్ లాగా ఎన్టీఆర్ ని కూడా టైగర్ 3కి తెలుగులో పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారా అనే అనుమానాలు కలగడం సహజం. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..