2019 నాని టార్గెట్.. మూడు సినిమాలు?

By Prashanth MFirst Published Apr 10, 2019, 4:54 PM IST
Highlights

 దీంతో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమా రిలీజ్ పనుల్లో నాని బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

న్యాచురల్ స్టార్ నాని జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా లెక్క చేయడం లేదు. నాని హిట్టు చూసి చాలా కాలమవుతోంది. నిన్నుకోరి అనంతరం సరైన హిట్ అందుకోలేదు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ బాగానే అనిపించినా పూర్తిస్థాయిలో నాని మెప్పించలేకపోయాడు. 

ఇక కృష్ణార్జున యుద్ధం - దేవ్ దాస్ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని ఇచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దీంతో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమా రిలీజ్ పనుల్లో నాని బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ  సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. 

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే మరో డిఫరెంట్ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక తనకి అష్టాచమ్మా సినిమాతో సినీ కెరీర్ కి లైఫ్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి నాని షెడ్యూల్ సెట్ చేసుకుంటున్నాడు. మొత్తంగా 2018లో ఊహించని దెబ్బలు తిన్న నాని 2019లో మాత్రం వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.    

click me!