ఫ్యాషన్ డిజైనర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమాయణం!

Published : Apr 10, 2019, 04:27 PM IST
ఫ్యాషన్ డిజైనర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమాయణం!

సారాంశం

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది. 

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె 'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాలతో పాటు వెబ్ సిరీర్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.

రీసెంట్ గా 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్ లో నటించి తన అందాల ప్రదర్శనతో షాకిచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ బ్యూటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

కొంతకాలం క్రితం ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రణవ్ మిశ్రాను కలిసిన శోభిత అతడితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియా ఈ జంట డేటింగ్ లో ఉందని వార్తలు ప్రచురిస్తోంది.

అయితే వీరిమధ్య ఉన్నది  కేవలం స్నేహమా..? లేక మరేదేమైనానా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'మూతోన్' అనే సినిమాలో  నటిస్తోంది. మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా సేక్రేడ్ గేమ్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్‌.. దేవుడిని మన కళ్లముందుంచాడంటూ పోస్ట్
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?