డిజాస్టర్ హీరోయిన్ లక్కు బావుంది!

Published : Apr 10, 2019, 04:14 PM ISTUpdated : Apr 10, 2019, 04:16 PM IST
డిజాస్టర్ హీరోయిన్ లక్కు బావుంది!

సారాంశం

ఆకట్టుకునే అందం ఎంత ఉన్నా కూడా హిట్టు వస్తేనే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తుంటాయి. కానీ లై బ్యూటీ అదృష్టం ఏమిటో గాని ప్లాపులు ఎన్ని వస్తున్నా ఛాన్సులు తగ్గడం లేదు.

ఆకట్టుకునే అందం ఎంత ఉన్నా కూడా హిట్టు వస్తేనే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తుంటాయి. కానీ లై బ్యూటీ అదృష్టం ఏమిటో గాని ప్లాపులు ఎన్ని వస్తున్నా ఛాన్సులు తగ్గడం లేదు. లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మేఘా ఆకాష్ మొదటి సినిమాతోనే ఊహించని విధంగా డిజాస్టర్ అందుకుంది. 

ఇక ఆ తరువాత నితిన్ అమ్మడికి ఛల్ మోహన్ రంగ ద్వారా మరో అవకాశం ఇవ్వగా అది కూడా బెడిసికొట్టింది. ఇక తమిళ్ లో సూపర్ స్టార్ రజినీ పేట సినిమాతో పాటు  శింబుతో అత్తారింటికేది దారేది రీమేక్ లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మెగా యువ హీరో వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రంలో మేఘా ఆకాష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాలో ఇదివరకే మనిషా అనే కొత్త హీరోయిన్ ను సెలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు మేఘాను ఎంపిక చేయడంతో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అన్నట్లు టాక్ వస్తోంది. ఇకపోతే గత సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ చక్కనమ్మ చటుక్కున అవకాశాలను అందుకోవడంతో మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు. తమిళ్ లో ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న మేఘా హిందీలో కూడా ఓ సినిమా చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

తీవ్ర పోటీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీ హక్కులు ఎంత ధరకు అమ్ముడయ్యాయో తెలుసా ?
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!