‘ఛావా’ తెలుగు ట్రైలర్, గూస్ బంప్స్

Published : Mar 03, 2025, 11:48 AM ISTUpdated : Mar 03, 2025, 11:49 AM IST
‘ఛావా’ తెలుగు ట్రైలర్, గూస్ బంప్స్

సారాంశం

శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా హిందీలో విడుదలై 500 కోట్లకు పైగా వసూలు చేసిన 'ఛావా' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయకపోవడంతో తెలుగులో విడుదల చేయాలని నెటిజన్లు కోరారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నారు.

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కిన ఛావా  ఎంత పెద్ద హిట్టైందో  తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల‌కు పైగా సాధించింది. పోటీగా మ‌రే సినిమా కూడా లేక‌పోవ‌డంతో? ఈ వారం కూడా `చావా`దే హ‌వా. అయితే ఇంత గొప్ప చిత్రాన్ని మ‌డాక్ ఫిల్మ్స్ కేవ‌లం హిందీ రిలీజ్ వ‌ర‌కే ప‌రిమితం చేసింది.

ఇంకే భాష‌ల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈచిత్రాన్ని తెలుగు స‌హా ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ చేసి ఉంటే సినిమా ఇప్ప‌టికే 300 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయేద‌ని అంచ‌నా వేసారు ఇప్ప‌టికీ మించిపోలేద‌ని తెలుగు-డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయాలని నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదికగా మ‌డాక్ సంస్త‌ను రిక్వెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలో తెలుగులో ఈ సినిమా రిలీజ్ కు రంగం సిద్దమైంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసారు. 
 
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  మార్చి 7వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.  ఆ రోజు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు.  
 
తెలుగు వర్షన్‌లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్‌ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ఛావా తెలుగు డబ్బింగ్‌ పనులను ప్రారంభించినట్లు సమాచారం

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?