Nani : గుడ్ న్యూస్ చెప్పిన నాని.. ‘సరిపోదా శనివారం’ అప్డేట్ రెడీ.. ఎప్పుడంటే?

Published : Feb 17, 2024, 10:31 PM IST
Nani : గుడ్ న్యూస్ చెప్పిన నాని.. ‘సరిపోదా శనివారం’ అప్డేట్ రెడీ.. ఎప్పుడంటే?

సారాంశం

నేచురల్ స్టార్ నాని (Nani) తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. నెక్ట్స్ సినిమా ‘సరిపోదా శనివారం’ Saripodhaa Sanivaaram నుంచి అప్డేట్ అందించారు. అదేంటంటే? 

నేచురల్ స్టార్ నాని Nani  రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా నాని మంచి వసూళ్లనే రాబడుతున్నారు. చివరిగా ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో మంచి రిజల్ట్ నే అందుకున్నారు. దసరాతో 100కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ నాని ‘సరిపోదా శనివారం’ Saripodhaa Sanivaaramతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఈ మూవీ ఇప్పటికే తెలంగాణ, ఏపీలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, ఏపీలో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju దక్కించుకున్నారు. ఆంధ్ర, నైజాం, సీడెడ్ కలిపి రూ.25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు యూనిట్. ‘వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్’ అంటూ ఈ శనివారం అప్డేట్ ను అందించారు. 

అయితే నాని పుట్టిన రోజు ఫిబ్రవరి 24న ఉండటంతో ఓ సాలిడ్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ స్పెషల్ అప్డేట్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక నాని - వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ లో గతంలో ‘అంటే సుందరానికీ’ చిత్రం వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ రూపుదిద్దుకుంటోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే