నైజాంలో తన రికార్డులను తనే బ్రేక్‌ చేసిన ప్రభాస్‌.. `సలార్‌` రికార్డ్ షేర్‌..

By Aithagoni Raju  |  First Published Feb 17, 2024, 4:54 PM IST

ప్రభాస్‌.. `సలార్‌`తో కమ్‌ బ్యాక్‌ అయ్యారు. అదేసమయంలో తన సత్తా ఏంటో చూపించాడు. అయితే ఈ మూవీతో తన రికార్డుని తన బ్రేక్‌ చేసుకున్నాడు డార్లింగ్‌.
 


ప్రభాస్‌ గతేడాది `సలార్‌`తో సంచలనం సృష్టించింది. యాక్షన్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా వచ్చిన ఈ మూవీ డిసెంబర్‌ 22న విడుదలై భారీ వసూళ్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది 750కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. `డంకీ` వంటి గట్టి పోటీ మధ్య ఆ స్థాయి కలెక్షన్లని రాబట్టడం మామూలు కాదు. అది కేవలం ప్రభాస్‌ ఇమేజ్‌, సినిమాలో యాక్షన్‌ సీన్లే కారణమని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ఈ మూవీ నైజాంలో సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక కలెక్షన్లని సాధించిన మూవీగా నిలిచింది. ఈ మూవీ ఏకంగా 71కోట్ల షేర్‌ సాధించింది. అంటే దాదాపు 140 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని చెప్పొచ్చు. ఇక నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు. 90కోట్లకి నైజాం రైట్స్ ని దక్కించుకున్నారు. ఇందులో 65కోట్లు తిరిగి ఇచ్చేది లేకుండా(నాన్‌ రిటర్నబుల్‌), 25కోట్లు రిటర్నబుల్‌ లెక్కగా ఒప్పందం కుదిరింది. ఓ రకంగా తిరిగి ఇచ్చేది లేకుండా బయ్యర్లు సేఫ్‌ అయ్యారు. కానీ మిగిలిన 20కోట్ల నష్టం మాత్రం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ లెక్క కింద `పార్ట్ 2` రైట్స్ ఇచ్చే ఒప్పందం ఉందని తెలుస్తుంది. 

Latest Videos

ఇక ఈ మూవీ తమిళం, కన్నడ, మలయాళంలో పెద్దగా సత్తచాటలేకపోయింది. తెలుగు స్టేట్స్ లో, నార్త్ లో, ఓవర్సీస్‌లో మాత్రం దుమ్మురేపింది. అలా ఏడువందల యాభై కోట్లు వసూలు చేసిందని టీమ్‌ చెబుతుంది. బిజినెస్‌ కి, కలెక్షన్లకి దగ్గరగా వెళ్లిందని, కొన్ని చోట్ల నష్టాలు వచ్చాయని టాక్‌. అయితే నిర్మాతలకు మాత్రం ఈ మూవీ చాలా సేఫ్‌ ప్రాజెక్ట్ అని ట్రేడ్‌ వర్గాల టాక్‌. 

ఇదిలా ఉంటే నైజాంలో `సలార్‌` రికార్డు క్రియేట్‌ చేసింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలచింది. సంచలన మూవీ `బాహుబలి 2` నైజాంలో 112కోట్లు గ్రాస్‌, 68కోట్ల షేర్‌ రాబట్టింది. అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌` కూడా 111.8కోట్ల గ్రాస్‌, అరవై కోట్ల షేర్‌ సాధించినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన `సలార్` ఆ రెండు రికార్డులను బ్రేక్‌ చేసిందని చెప్పొచ్చు. అంతేకాదు ప్రభాస్‌ తన (బాహుబలి 2) రికార్డుని తనే బ్రేక్‌ చేశాడని చెప్పొచ్చు. 

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఝాన్సీ, ఈశ్వరీరావు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ప్రస్తుతం `సలార్‌` పార్ట్ 2.. `సలార్‌ః శౌర్యంగపర్వం`పై వర్క్ చేస్తున్నారు దర్శకుడు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశం ఉందట. 
 

click me!