Bandla Ganesh : బండ్ల గణేష్ వార్నింగ్... బూతులు తిడుతున్న వీడియో వైరల్.!

By Nuthi Srikanth  |  First Published Feb 17, 2024, 10:07 PM IST

పొలిటిషన్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఆఫీసులో జరిగిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. దంపతులకు ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 


బండ్ల గణేష్.. ఈ పేరు సినిమాలు, రాజకీయకంగా కంటే.. వివాదాల పరంగానే ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆయన ఎక్కడ మాట్లాడిన సంచనంగా మారుతుంటుంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడని చెబుతూ ఉంటారనే విషయం తెలిసిందే. సినీ ఈవెంట్లలోనూ ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. నిర్భయంగా, నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. 

నిర్మాతగా, నటుడిగా పలు చిత్రాలో బండ్ల గణేష్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘డేగల బాబ్జీ’ (Degala Babji) సినిమాతో అలరించారు. ఇదిలా ఉంటే... అటు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానూ ప్రజా సేవలో ఉన్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఆయన కాంగ్రెస్ కోసం ఎంత పోరాడారో తెలిసిందే. ఈ మధ్య కాస్తా ఎక్కడా  కనిపించని బండ్ల గణేష్.. తాజాగా ఓ దంపతులకు వార్నింగ్ ఇస్తూ కనిపించారు. 

Latest Videos

తన ఆఫీస్ కు వచ్చిన ముస్లిం దంపతులతో మాట్లాడుతున్నట్టు కనిపించారు. ఓవైపు బండ్లన్న మాట్లాడుతుంటూనే మరోవైపు తన అనుచరుడు ఘర్షణ పడుతూనే ఉన్నాడు. చివరికి బండ్ల గణేష్ కూడా ‘అమ్మని’ అంటూ ఆ దంపతులను బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఓ ఇంటి స్థలం నుంచి వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

బండ్ల గణేష్ రౌడీయిజం.. ఇళ్లు స్థలం వివాదంలో ముస్లిం మహిళను బూతులు తిడుతూ దాడికి యత్నం. pic.twitter.com/o0KusG68el

— Telugu Scribe (@TeluguScribe)
click me!