బిగ్ బాస్ డే45: హరితేజ బుర్రకథలో చెప్పిన పిచ్చిది ఎవరు

Published : Aug 31, 2017, 11:08 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
బిగ్ బాస్ డే45: హరితేజ బుర్రకథలో చెప్పిన పిచ్చిది ఎవరు

సారాంశం

సరదాగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు షో 45వ రోజు బుర్రకథతో అలరించిన హరితేజ బిగ్ బాస్ షో మొదలైన దగ్గర్నించి జరిగిన విశేషాలు కథలో చెప్పిన హరితేజ

త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆలో హీరోయిన్ పక్కన ఆకట్టుకునే రోల్ చేసి హరితేజ తనవైపు అటెన్షన్ క్రియేట్ చేసింది. ఆ పాత్రని ఆమె అన్నివిధాలుగా వినియోగించుకుని మంచి క్రేజ్ సంపాదించింది. సీరియల్స్ లో కూడా మంచి అనుభవం వున్న హరితేజ బిగ్ బాస్ షోలో ఎంపికైంది. ఇక ఈ వారం కెప్టెన్ గా ఉన్న హరితేజ సాధ్యమైనంత వరకు తన కెప్టెన్సీలో గొడవలు రాకుండానే ట్రై చేస్తోంది. లక్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా హరితేజ నిన్న ఎపిసోడ్ లో చెప్పిన బుర్ర కథ బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ షో మొదటి వారం నుండి ప్రస్తుతం వరకు హరితేజ చెప్పిన బుర్ర కథ హౌజ్ మెట్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

 

హరితేజ కూడా తను చెప్పిన బుర్రకథలో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లు ఎలా అయారు.. ఇక మిగిలిన వాళ్లలో వున్న లోపాటు ఏంటి.. అనే సబ్జెక్ట్ ఎంచుకుని బుర్రకథలో చాలా అద్భుతంగా.. అంటే.. ఒకరకంగా చెప్పాలంటే గౌతమిపుత్ర శాతకర్ణిలో... కన్నడ సూపర్ స్టార్ శివకుమార్ కూడా అంత బాగా చెప్పలేదా అనిపించేలా.. హరితేజ బిగ్ బాస్ హౌజ్ పైన తనదైన టాలెంట్ తో బుర్రకథ చెప్పింది. ఇక ట్విస్ట్ ఏంటంటే అందరిలో లోపాలను ఎత్తి చూపిన హరితేజ.. ఒకర్ని మాత్రం పిచ్చిది అంటూ సంబోధించింది. ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరవుతారో అంటూ కథలో చెప్తూ... శివబాలాజీ అవుతాడా అనుకుంటే... “పిచ్చిది వచ్చి శివను కాపాడెరా” అంటూ ఒక హౌజ్ మేట్ ను పిచ్చిది అని సంబోధించింది. ఇంతకీ ఆ పిచ్చిది అనే పదం ఎవర్ని ఉద్దేశించి అన్నదా అని బిగ్ బాస్ ఇంటా బయటా పెద్ద చర్చ జరుగుతోంది. అది తనను తాను ఉద్దేశించి హరితేజ అలా అంది.

 

ఇక నవదీప్ నేనే రాజు నేనే మంత్రిలో పోసాని డైలాగ్ “అది గుర్తించాలి మీరు “ అంటూ చెప్పి తోటి సభ్యులను ఆటపట్టించాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు ఇచ్చిన లగ్జరీ బడ్టెట్ టాస్ట్... గుడ్లు క్యాచ్ పట్టుకుని వస్తువులు సంపాదించారు. తమలోని టాలెంట్ బయట పెట్టేందుకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నారు హౌజ్ మట్స్. ఇక ఈ బిగ్ బాస్ షో ముగిసే టైం దగ్గర పడుతుంది. ఇన్నాళ్లు హౌజ్ మేట్స్ లో లోపాలను చూపించి నామినేట్ చేసిన హౌజ్ మేట్స్ ఇక నుండి తమ పోటీ దారులను టార్గెట్ చేయనున్నారు.

 

మొత్తానికి తారక్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కేవలం శని ఆదివారాలలోనే కాకుండా మిగతా వారాల్లో కూడా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఇంటిని వదిలి వెళ్తారు.. ఒకవేళ ఈ వారం కూడా ఇద్దరు బయటకు వెళ్లాల్సి వస్తే.. ఆ ఇద్దరు ఎవరు అన్నదే చర్చనీయాశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే