Nani New Movie : మలయాళ మంత్రం వేసిన నాని.. నేచురల్ స్టార్ స్కెచ్ మూమూలుగా లేదుగా..?

Published : Jan 22, 2022, 07:44 PM IST
Nani New Movie : మలయాళ మంత్రం వేసిన నాని.. నేచురల్ స్టార్ స్కెచ్ మూమూలుగా లేదుగా..?

సారాంశం

నేచురల్ స్టార్ నానీ(Nani)  పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. సక్సెస్ కోసం మంచి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. మన తెలుగుతో పాటు మలయాళం ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేశాడు నానీ. అందుకే త సినిమా గురించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నానీ(Nani)  పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. సక్సెస్ కోసం మంచి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. మన తెలుగుతో పాటు మలయాళం ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేశాడు నానీ. అందుకే త సినిమా గురించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నాని (Nani)  హీరోగా రీసెంట్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ (Shyam Singh Roy ) సూపర్ హిట్ అయ్యింది. నానీ(Nani)కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో సినిమాల విషయంలో దూసుకుపోతూనే.. ఆలోచించి అడుగులు వేయాలి అని నిర్ణయించుకున్నాడట నాని(Nani)  . అందుకే తన సినిమాలకు మలయాళ మంత్రం వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎంటా మలయాళ మంత్రం.

 ప్రస్తుతం నానీ శ్యామ్ సింగ రాయ్(Shyam Singh Roy ) రిలీజ్ అయిపోయింది. ఇఫ్పుడు ఆఞన అంటే .. సుందరానికీ మూవీ స్తున్నాడు. బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ తరువాత సినిమాగా నాని  దసరా ను లైన్లో పెట్టేశాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది.  

శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న దసరా(Dusara) మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  తెలంగాణలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలోనే మాట్లాడతాడట. అందుకోసం ఆయన ట్యూటర్ ను పెట్టి నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో  ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సారి నేచురల్ స్టార్ నాని(Nani) మలయాళ ఫిల్మ్ ఇండస్టరీని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దసరా సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం.  అందువల్లనే మలయాళానికి చెందిన యంగ్ స్టార్  రోషన్ మాథ్యూ ని ఒక కీలకమైన పాత్ర కోసం ఈ సినిమాలో సెలక్ట్ చేశారట. దానితో పాటు ఈమూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తుంది. దాంతో మలయాళంలో తనకు కలిసి వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు నాని(Nanni).

ఇప్పటికే మలయాళంలో మన టాలీవుడ్ స్టార్ హీరో  అల్లు అర్జున్(Allu Arjun) కు మంచి క్రేజ్ ఉంది. ఈమధ్య ఎన్టీఆర్ స నిమాలు కూడా అక్కడ నడుస్తున్నాయి. అటు మాలీవుడ్ నుంచి యంగ్ హీరోలంతా టాలీవుడ్ కు తరలి వస్తున్నారు. దాంతో నానీ కూడా తన సినిమాను అక్కడ వర్కౌట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈమూవీలో సీనియర్ స్టార్స్ సాయికుమార్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Bhanu Chander: సాయం కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. ఎలా స్పందిస్తారంటే..