Samantha: బిజినెస్‌ని విస్తరించిన సమంత.. ఇప్పుడు కిడ్స్ వేర్‌ కూడా..

Published : Jan 22, 2022, 07:13 PM IST
Samantha: బిజినెస్‌ని విస్తరించిన సమంత.. ఇప్పుడు కిడ్స్ వేర్‌ కూడా..

సారాంశం

రెండేళ్ల క్రితం సమంత `సాకీ` పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించింది. ఫ్యాషన్‌ రంగంలో తనదైన స్పెషాలిటీతో ఈ సాకీని క్లాత్స్ వేర్‌ని ప్రారంభించింది. 

సమంత(Samantha) ఓ వైపు కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. ఆమె ప్రస్తుతం తెలుగు నుంచి ఇంటర్నేషనల్‌ వరకు వరుసగా సినిమాలు చేస్తుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని మించి గ్లోబల్‌ ఇమేజ్‌ దిశగా అడుగులు వేస్తుంది. నటిగా ఆమె జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా సాగుతుంది. మరోవైపు తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది సమంత. వ్యాపార పరంగానూ మరో అడుగు ముందుకేసింది. 

రెండేళ్ల క్రితం Samantha.. తన ఫ్రెండ్‌ సుశృతి క్రిష్ణతో కలిసి `సాకీ`(Saaki) పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించింది. ఫ్యాషన్‌ రంగంలో తనదైన స్పెషాలిటీతో ఈ సాకీని క్లాత్స్ వేర్‌ని ప్రారంభించింది. తన ప్రొడక్ట్ లకు తనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి ప్రమోట్‌ చేసింది సమంత. కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో ఆమె పూర్తిగా ఈ బిజినెస్‌ పైనే దృష్టిపెట్టింది. అయితే రెండేళ్ల తర్వాత దీన్ని విస్తరించబోతుంది. అప్పుడు టీనేజ్‌, అడల్ట్స్, ఉమెన్స్ కి ఉండగా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విస్తరిస్తుంది. 

`సాకీ` బ్రాండ్‌లో భాగంగా `సాకీ గర్ల్స్`(Saaki Girls) పేరుతో కిడ్స్ వేర్‌ని లాంచ్‌ చేయబోతుంది. రెండేళ్ల నుంచి 8ఏళ్ల వరకు గర్ల్స్ కి ఈ కిడ్స్ వేర్‌ని ప్రారంభించబోతున్నారు. ఇందులో అన్ని రకాల మోడల్స్ ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ విషయాన్ని సమంతతోపాటు సాకీ ఫౌండర్‌ సీఈవో సుశృతి క్రిష్ణ తాజాగా ప్రకటించింది. సమంత కెరీర్‌ విస్తరించినట్టుగానే తన బిజినెస్‌ కూడా అభివృద్ధికావడం అభినందనీయం. 

ఇక నాగచైతన్యతో విడాకులు ప్రకటించి అభిమానులను షాక్‌కి గురి చేసిన సమంత ఆ తర్వాత కొద్ది గ్యాప్‌తో ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. తనకిష్టం వచ్చినట్టుగా, నచ్చినట్టుగా జీవితాన్ని గడిపేందుకు సిద్ధమైంది. ఓ వైపు వ్యక్తిగత జీవితంలో తన ఇష్టాఇష్టాలకు ప్రయారిటీ ఇస్తూనే కెరీర్‌ పరంగానూ తనకు నచ్చిన ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.

 ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌`, అలాగే `యశోద` అనే పాన్‌ ఇండియా సినిమా, దీంతోపాటు డ్రీమ్ వారియర్స్ సంస్థలో మరో సినిమా చేస్తుంది. బాలీవుడ్‌లోనూ ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు టాక్‌. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ సినిమా చేయబోతుంది సమంత. ఫిలిప్‌జాన్‌ రూపొందిస్తున్న `అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌` అనే చిత్రంలో అను పాత్రలో నటిస్తుంది సమంత. దీనికి సునీత తాటి నిర్మాత. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు