Sri Reddy: చిరంజీవి తల్లిని తిట్టాను.. శిక్ష అనుభవించా.. క్షమించండి: శ్రీరెడ్డి (వీడియో)

By Surya PrakashFirst Published Jan 22, 2022, 7:33 PM IST
Highlights


 ఒక ఆడదాన్ని అన్యాయంగా తిట్టడం తప్పే.. ఆ తప్పు నేను చేశాను.. పెద్ద మనసు చేసుకుని నా తప్పుని క్షమించమని ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా క్షమాపణ చెప్తున్నా అంటూ  శ్రీరెడ్డి విడుదల  చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి(Sri Reddy) అర్ధనగ్న ప్రదర్శనతో అప్పట్లో సెన్సేషన్  అయ్యింది.  ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించిన తీరు నచ్చక శ్రీరెడ్డి.. ఆయనపై విరుచుకుపడింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్ర పదజాలంతో దూషించింది శ్రీరెడ్డి. అయితే ఉద్యమం తీవ్రతరం అవ్వాలంటే.. పవన్ కళ్యాణ్‌ని అతని తల్లిని తిట్టమని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మే తనకి సలహా ఇచ్చాడంటూ అప్పట్లో బాంబ్ పేల్చి అతని బండారం బయటపెట్టింది శ్రీరెడ్డి. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ వర్మ స్పందించలేదు కానీ.. అకారణంగా చిరంజీవి తల్లిని తిట్టినందుకు పశ్చాత్తాప పడుతున్నానంటూ చాలా కాలం తరువాత క్షమాపణ చెప్పింది Sri Reddy.

రీసెంట్ గా అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీరెడ్డి.. హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్‌ని దర్శించుకున్నారు. ఈ సందర్భంలో అమ్మ వారి సాక్షిగా చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనా దేవికి క్షమాపణ చెప్పింది శ్రీరెడ్డి.
 

నన్ను క్షమించండి "అంజనమ్మ" 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt

— Sri Reddy (@MsSriReddy)

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆడవాళ్ల కోసం చేసే ఉద్యమానికి న్యాయం జరగాలంటే.. ఒక ఆడదాన్ని తిట్టాలని ఒక పెద్ద మనిషి నా బ్రెయిన్ వాష్ చేసి అతని పంతం కోసం నన్ను ఉపయోగించుకున్నాడు. అతనికి చిరంజీవికి ఎలాంటి తగాదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ.. చిరంజీవి కుటుంబం తరలివస్తుందని ఈ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో నేను అమాయకురాలైన అమ్మని తిట్టారు. ఈ ఇష్యూతో ఏ సంబంధం లేని తల్లిని నేను తిట్టాల్సి వచ్చింది. దానికి శిక్ష కూడా నేను అనుభవించాను. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. పర్సనల్‌గా నాకు ఫోన్లు చేసి బెదిరించారు. మా సొంతవాళ్లు కూడా అలా అనడం తప్పు అని చెప్పారు. ఆ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను.

అందుకే అమ్మవారి శక్తి (పెద్దమ్మ టెంపుల్) ముందు నేను చెప్తున్నా.. ఒక ఆడదాన్ని అన్యాయంగా తిట్టడం తప్పే. దానికి నేను ఒప్పుకుంటున్నా.. నేను తప్పు చేశాను.. పెద్ద మనసు చేసుకుని ఆ పెద్దమ్మ తల్లి ఎలాగైతే క్షమిస్తుందో నన్ను కూడా క్షమించండి. ఇండస్ట్రీలో చిరంజీవి అనేవారు ఒక పెద్ద హీరో.. వాళ్ల అమ్మగారిని నేను తిట్టాల్సింది కాదు.. నా బుద్ది గడ్డితిని అన్నాను. నన్ను మభ్యపెట్టి తిట్టించారు. అమ్మవారి సాక్షిగా ఈరోజు చిరంజీవి తల్లిగారు అంజనా దేవి గారికి క్షమాపణ చెప్తున్నాను. నా జీవితంలో నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడానికి సిగ్గుపడను. ఎందుకంటే ఆ పాపాన్ని మోయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే అంజనా దేవి గారూ నన్ను క్షమించండి’ అంటూ క్షమాపణ కోరింది శ్రీరెడ్డి.

 

click me!