
ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనూ సీజన్ 11 కూడా ప్రారంభం కానుంది. ఈ బుల్లితెర రియాల్టీ షో.. తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే తెలుగులో సీజన్ 1 పూర్తి చేసుకుంది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు.
ఈ షో హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. మొదట బిగ్ బాస్ కాంటెస్ట్ లను చూసి అందరూ నిరాశ పొందినా.. శని ఆదివారాల్లో వచ్చిన తారక్.. ఆ నిరాశను దూరం చేశారు. తన వాక్ చాతుర్యం, హావభావాలతో షో ని హిట్ చేశాడు. సీజన్-1 గడిచి వారం రోజులు కూడా గడిచిందో లేదో రెండో సీజన్ ఎప్పుడు ప్రారంభమౌతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటేనే అర్థమౌతోంది తెలుగు నాట ఎంత హిట్ అయ్యిందో. అయితే.. సీజన్ 2కి హోస్టుగా ఎన్టీఆర్ చేయడం లేదట. న్యాచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
అతి తక్కవ కాలంలో.. తన నటతో ప్రేక్షకులకు చేరువైన నటుడు నాని. ఆయన తన సినిమాల్లో మాదిరిగానే.. బయట కూడా చాలా సరదాగా ఉంటాడని టాక్. దీంతో.. నాని హోస్టుగా చేసినా బాగానే ఉంటుంది అని పలువురు భావిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని హోస్టుగా ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.