పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కి అమెజాన్‌ ట్రిబ్యూట్..

Published : Jan 21, 2022, 03:17 PM ISTUpdated : Jan 21, 2022, 03:52 PM IST
పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కి అమెజాన్‌ ట్రిబ్యూట్..

సారాంశం

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమాటిక్‌ విజన్‌ ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.  ఆయనకు సంబంధించిన మూడు సినిమాలను అమెజాన్‌లో విడుదల చేయబోతుంది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్‌ కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కి ట్రిబ్యూట్‌ ఇవ్వబోతుంది.  పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మాణ సంస్థ అయిన పీఆర్‌కే ప్రొడక్షన్‌లో నిర్మితమైన `వన్‌ కట్‌ టూ కట్‌`, `ఫ్యామిలీ ప్యాక్‌`, `మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌` చిత్రాలను విడుదల చేయబోతున్నారు. దీన్ని రిలీజ్‌ రైట్స్ దక్కించుకున్న అమెజాన్‌.. తమ అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు వెల్లడించింది. పునీత్‌పై ఉన్న ప్రేమతో, పునీత్‌ సినిమాటిక్‌ విజన్‌ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

వీటితోపాటు పునీత్‌ కుమార్‌ ప్రొడక్షన్‌లో నిర్మితమైన చిత్రాలు `కవులుదారి`, `మాయాబజార్‌2016`, `లా`, `ఫ్రెంచ్‌ బిర్యానీ`, `యువరత్న` వంటి చిత్రాలను నెల రోజులపాటు ఫ్రీగా ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రైమ్‌లో ఉన్న ఈ చిత్రాలను ఫిబ్రవరి ఒకటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. నెల రోజుల పాటు ఈ చిత్రాలను ఫ్రీగా తమ కస్టమర్లకి అందించబోతుంది అమెజాన్. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఇకపై కూడా అమెజాన్‌, పీఆర్‌కే సంస్థలు కలిసి సినిమాలను రిలీజ్‌ చేయబోతున్నాయని తెలిపారు. 

ఇదిలా ఉంటే కన్నడ నాట పవర్‌ స్టార్‌గా వెలుగొందిన పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.తన ఇంట్లో జిమ్‌ చేస్తున్న క్రమంలో ఆయన హార్ట్ ఎటాక్‌కి గురయ్యారని, దీంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యంగ్‌ ఏజ్‌లోనే ఆయన మరణించడంతో జీర్ణించుకోలేకపోయారు. 

పునీత్‌రాజ్‌ కుమార్‌ చనిపోయేనాటికి మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో `జేమ్స్` అనే చిత్రం ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీన్ని ఇతరులతో డబ్బింగ్‌ చెప్పి విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు `గందడ గుడి` అనే మరో సినిమాలో, అలాగే `లక్కీ మ్యాన్‌` చిత్రంలో గెస్ట్ గా నటించారు పునీత్‌. ఈ చిత్రాలు విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు