నాని-బలగం వేణు సినిమా టైటిల్‌ ఇదే.. ఊర మాస్‌ లెక్క

Published : Dec 06, 2023, 03:48 PM ISTUpdated : Dec 06, 2023, 04:09 PM IST
నాని-బలగం వేణు సినిమా టైటిల్‌ ఇదే.. ఊర మాస్‌ లెక్క

సారాంశం

నేచురల్‌ స్టార్‌ నాని త్వరలో తాను `బలగం` వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఆసక్తికర టైటిల్‌ వినిపిస్తుంది.   

హీరో నాని తన ట్రెండ్‌ మారుస్తున్నారు. డిఫరెంట్‌ కంటెంట్‌ చిత్రాలు చేస్తున్నారు. `దసరా` చిత్రంతోనే ఆయన తన స్టయిల్‌ మార్చేశాడు. ఇప్పుడు సరికొత్త కథలతో వెళ్తున్నారు. ప్రస్తుత `హాయ్‌ నాన్న` చిత్రంలో రాబోతున్నారు. ఆ తర్వాత వివేక్‌ ఆత్రేయతో ఓ మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్నారు. దీంతోపాటు `బలగం` ఫేమ్‌ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విసయం బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అది ఒక ఊరమాస్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈ సినిమాకి `యల్లమ్మ`(ఎల్లమ్మ) అనే టైటిల్‌ని ఖరారు చేశారట. తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది. ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు. అలాంటిది నాని సినిమాకి టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం `హాయ్‌నాన్న` చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ చేశారు. ఇందులో వేణు ఎల్దండి దర్శకత్వంలో సినిమా గురించి బయటపెట్టారు. ఒక అభిమాని.. కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. బలగం వేణు అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాని ఈ కామెంట్స్ చేయడంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో  సినిమా పక్కాగా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు నాని. 

ఇక `హాయ్ నాన్న` సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక నాని తన 30వ సినిమాగా `హాయ్ నాన్న`ను చేశారు. తన 31వ సినిమాగా `సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు.  వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో `అంటే సుందరానికి` మూవీ వచ్చింది. ఇది చాలా డిజప్పాయింట్‌ చేసింది. అయితే ఆసారి మాత్రం వీరికాంబోలో మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్