రజినీకాంత్ కు విలన్ గా రాఘవ లారెన్స్.. క్రేజీ న్యూస్ లో నిజమెంత..?

Published : Dec 06, 2023, 03:15 PM IST
రజినీకాంత్ కు విలన్ గా రాఘవ లారెన్స్.. క్రేజీ న్యూస్ లో నిజమెంత..?

సారాంశం

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో.. మంచి దర్శకులను తీసుకుంటి సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా రజినీకాంత్ సినిమాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

జైలర్  సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈసినిమాతో తన  విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు. విమర్షించే నోటికి  తాళం వేశారు రజినీకాంత్. వసూళ్ల పరంగా జైలర్  కొత్త రికార్డులను నమోదు చేసింది. ఓటీటీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా తరువాత సినిమాల విషయంలో జోరు పెంచాడు తమిళ తలైవా. వరుస  ప్రాజెక్టులను రజనీ చాలా ఫాస్టుగా లైన్లో పెట్టేశారు. 

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్  జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.  సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను చాలా త్వరగా పూర్తి చేసి.. ఆ వెంటనే లోకేశ్ కనగరాజ్ తో సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటీ అంటే.. ఈసినిమాలో  విలన్ గా లారెన్స్ పేరు వినిపిస్తోంది. లోకేశ్ కనకరాజ్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన సినిమాలో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో.. విలన్ కూడా అంతే పవర్ ఫుల్ గా చూపిస్తుంటాడు. అందుకే ముందు విలన్ ను తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. 

Hi Nanna: కన్నడ సూపర్ స్టార్ తో టాలీవుడ్ నేచురల్ స్టార్, శివన్న నాని బ్రేక్ ఫాస్ట్ మీట్..

అందుకే రజినీకాంత్ సినిమా కోసం కూడా ఇలానే విలన్ గా రాఘవ లారెన్స్ ను తీసుకుని..సినిమాపై ఇంట్రెస్ట్ ను.. అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.   అదే పద్ధతిని ఆయన ఈ సినిమా విషయంలోనూ ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఇక రాఘవ లారెన్స్ విషయానికి వస్తే..  రజనీకి రాఘవ  వీరాభిమాని. రజినీకాంత్ కు వీరవిధేయుడిగా ఉంటారు లారెన్స్.  ఆయన స్టైల్ ను అనుకరిస్తూ ఉంటాడు కూడా. రజనీతో ఆయనకి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇప్పుడు తెరపై రజనీతోనే తలపడే అవకాశం ఆయనకి దక్కింది. 

Nayanthara: భర్త విఘ్నేష్ డైరెక్షన్ లో నయనతార మరో సినిమా..? హీరో ఎవరంటే..?

ఈఆమధ్య చంద్రముఖి 2 తీసినప్పుడు కూడా రెండు మూడుసార్లు వెళ్ళి తలైవా ఆశీర్వాదం తీసుకున్నారు రాఘవ. ఇక ఇప్పుడు తన తన ఫేవరేట్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదంటూ లారెన్స్ ఖుషీ అవుతున్నాడని టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే