
తమిళనాట లేడీ సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ కు కు కూడా చేరింది. షారుక్ ఖాన్ జోడీగా నయయనతార నటించిన జవాన్ సినిమా భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ భామ.. తాజాగా అన్నపూరణి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ త్వరలో ఓటీటీ రిలీజ్ కు కూడా రెడీ అవుతోంది.
ఇక లేడీ సూపర్ స్టార్ నెక్ట్స్ కూడా వరుస సినిమాలు ప్లాన్ చేస్తుందట. తాజాగా మరో కొత్త సినిమాతో ఆమె రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నయనతార ఓ యంగ్ హీరోకు అక్కగా నటించనున్నారట. తన భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో ఈమూవీ రూపొందబోతున్నట్టు సమాచారం. తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ సిస్టర్ రోల్ చేయబోతుంది.లవ్ టుడే సినిమాతో సెస్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌తో విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలోనే ప్రదీప్‌కు అక్కగా నయనతార నటించనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా గురించి ఇంతకుముందే వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాదు ఈమూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జన్వా కపూర్ నటించబోతున్నట్టు న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఇంకా అధికారిక అనౌన్స్మెంట్ చేయలేదు. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది నయనతార. ఇక ఈమూవీ కన్ ఫార్మ్ అయినతే నయనతారకు విఘ్నేష్ డైరెక్షన్ లో ఇది ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. అంతకుముందు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో వచ్చిన నానుమ్ రౌడి ధాన్, కత్తువాకుల రెండు కాదల్ చిత్రాలలో నయనతార హీరోయిన్‌గా నటించింది.