
అంటే సుందరానికి సినిమా చూసి తనకు ఈర్ష్య కలిగిందన్నారు డైరెక్టర్ సుకుమార్. సెకండ్ హాఫ్ చూశాక డైరెక్టర్ వివేక్ ఆత్రేయమీద కుళ్ళు వచ్చిందన్నారు. నానీ నేచురల్ యాక్టీంగ్ సూపర్ అన్నారు. నానీ నట ఆకాశం అన్నారు. నదియాగారు, రోహిణీ గారు, నరేష్ నటన అద్భుతమన్నారు. ఇక హీరోయిన్ నజ్రియా వల్లే తనకు ఫాహద్ ఫజిల్ పుష్పలో చేశారన్నారు.
ఇక పవర్ స్టార్ ను రెండేసార్లు కలిశానన్నారు సుకుమార్. ఫస్ట్ కలిసినప్పుడు.. తనకు కథ చెప్పే దైర్యం లేదని.. ఆర్య తరువాత పవర్ స్టార్ ను కలిశాన్నారు. ఆ టైమ్ లో పెళ్లి చేసుకోండి ఆని ఆయన చెప్పారని.. ఎందుకో వెంటనే తన పెళ్ళి జరిగిందని అన్నారు. ఇక రెండోసారి కలిసినప్పుడు.. నేను ఆయాసడుతూ ఉన్నాను. భీమ్లానాయక్ సెట్ లో కలిశాను.. అప్పుడు పవర్ స్టార్ నన్ను డాక్టర్ కు చూపించుకోమన్నారు. అప్పుడు త్రివిక్రమ్ గారు పవర్ స్టార్ కు చెప్పారట.. అతను ఏదో అయిపోయి ఆయాపడటం లేదు.. మిమ్మల్ని కలిసిన ఆరాటంలో... అన్నారు త్రివిక్రమ్,
నాని నేచురల్ స్టార్ అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తన టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఇక నానీ నటించిన తాజా సినిమా అంటే సుందరానికీ. ఈమూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ మధ్య అన్నీ విభిన్న కథలతో... డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక నానీ హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా అంటే ... సుందరానికీ. ఆచార వ్యవహారాలు బాగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. నానీ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రలో కనించబోతున్నాడు.
ఇక అలాంటి ఆచారాలు పాటించే వ్యాక్తి విదేశాలకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథతో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతంది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.