
మా అధ్యక్ష ఎన్నికలు మంచు ఫ్యామిలీ వెర్సస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు జరిగాయి. మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేశారు. ప్రకాష్ రాజ్ కి ఓపెన్ గా నాగబాబు, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. మంచు విష్ణును ఎన్నికల్లో నరేష్ అన్నీ తానై నడిపించాడు. చివరికి గెలిపించాడు. ఈ క్రమంలో నాగబాబు, నరేష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో పవన్ అభిమానులకు నరేష్ విరోధి అయ్యాడు.
ఆ సెగ అంటే సుందరానికీ ప్రీరిలీజ్ వేడుకలో నరేష్ కి పవన్ ఫ్యాన్స్ చూపించారు. వేదికపై నరేష్ మాట్లాడుతుండగా పెద్ద ఎత్తున గోల చేశారు. ఆయన్ని అసలు మాట్లాడనివ్వలేదు. నాని గురించి మాట్లాడుతుండగా నాన్ స్టాప్ గా గోల చేశారు. దీనితో చేసేది లేక నరేష్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు , నాని అభిమానులకు అంటూ పవన్ పేరు పలికారు. దీంతో మరింతగా రెచ్చిపోయారు. ఇక నరేష్ త్వర త్వరగా ముగించి వెళ్లిపోయారు.
పవన్ ఫ్యాన్స్ ప్రవర్తన గమనించిన యాంకర్ సుమ... సున్నితంగా వేడుకున్నారు. కొంచెం డిసిప్లైన్ గా ఉండాలి అన్నారు. మీరు ఆ బారికేడ్స్ విరగగొడితే శిల్పాకళావేదిక వారు మరలా మనకు ఈవెంట్స్ కోసం పర్మిషన్ ఇవ్వరు. అదే జరిగితే నాకు ఈవెంట్స్ రావు, కాబట్టి మీరు కొంచెం పద్ధతిగా ఉండండి అంటూ విజ్ఞప్తి చేశారు. వేదికపై ఎవరు మాట్లాడుతున్నా పవన్ పేరు పలకాల్సిందే అంటూ... గొడవ చేశారు.
ఇక అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కోసమే అన్నట్లు సాగింది. ఈవెంట్ ప్రారంభం నుండి ఎప్పుడు గ్యాప్ వచ్చినా.. పవన్ ఏవీ వీడియోతో హోరెత్తించారు. నిమిషాల నిడివి కలిగిన పవన్ ఏవీ... ఈవెంట్ కి వచ్చిన పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. నాని అభిమానులు మాత్రం అసహనానికి గురయ్యారు. ఓ హీరో మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో గెస్ట్ నామస్మరణ ఏంటని వాపోయారు.