
బాలయ్య (Balakrishna)కొత్తగా ప్రయత్నం చేయరు, చేసినా జనాలు చూడరు. ఆయనకు నప్పిన నచ్చిన జోనర్లో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. బాలకృష్ణ 107వ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ (NBK107 First Hunt Teaser) విడుదల కాగా... మూవీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అఖండ ని తలపిస్తుంది. నల్ల చొక్కా, బూడిద రంగు లుంగీ ధరించిన బాలయ్యను ఓ ఊరికి పెద్దగా పరిచయం చేశారు. అలాగే మైనింగ్ మాఫియాపై బాలయ్య యుద్ధం అన్నట్లుగా షాట్స్, గవర్నమెంట్ జీవోలపై డైలాగ్స్ ఉన్నాయి.
'నీది గవర్నమెంట్ ఆర్డర్.. నాది గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటా లోనే లేదుగా బోసడికే', 'నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా' వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ కట్ చేశారు. బాలయ్య ఫ్యాన్స్ ని అలరించే నాన్ స్టాప్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలకు ఈ మూవీలో కొదవుండదని తెలుస్తుంది. పొలిటికల్ ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ బాలయ్య మూవీలో డైలాగ్స్ రాసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. 2024 ఎన్నికలు సమీపిస్తుండగా బాలయ్య ఆ కోణంలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే అవకాశం కలదు.
బాలయ్య బర్త్ డే (Balakrishna Birthday)కానుకగా విడుదలైన ఆయన 107వ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం నిరాశ మిగిల్చింది. బాలయ్య గత చిత్రాలన్నీ మిక్స్ చేసి ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ డైలాగ్స్ కూడా ఆయన గత చిత్రాలను తలపిస్తున్నాయి. మొనాటమి కారణంగానే బాలయ్యకు హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఫలితాల సంగతి ఎలా ఉన్నా తనకు కలిసొచ్చిన జోనర్ వదలకుండా చేస్తున్నాడు బాలయ్య.
మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. క్రాక్ మూవీ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కాగా బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ రేపు వచ్చే అవకాశం కలదు.