Intinti Gruhalakshmi: వాసుదేవ్ కి అసలు నిజం చెప్పిన నందు.. న్యాయం కోసం ధర్నా చేస్తున్న దివ్య?

Published : Mar 25, 2023, 09:37 AM IST
Intinti Gruhalakshmi: వాసుదేవ్ కి అసలు నిజం చెప్పిన నందు.. న్యాయం కోసం ధర్నా చేస్తున్న దివ్య?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య ప్రియాతో మాట్లాడుతూ ఆ రాజ్యలక్ష్మి మంచిదే అయినప్పటికీ ఇటువంటి విషయాలలో కన్నా కొడుకుని వెనకేసుకొస్తుంది. ఆ వెంటనే సంజయ్ తల్లి వెనక దాక్కుంటాడు అని అంటుంది. డైరెక్ట్ గా వెళితే పనులు కావు పబ్లిక్ లోకి వెళ్దాము అనగా నావల్ల నీ జాబు రిస్క్ లో పడుతుందేమో మేడం అనగా నాకు చదువు ఉంది కాబట్టి నేను ఎక్కడైనా బతుకుగలను నీ జీవితం ఇంపార్టెంట్ అని ధైర్యం చెబుతూ ఉంటుంది దివ్య. సరే నువ్వు వెళ్ళు నువ్వు ఏం మాట్లాడాలో ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని అంటుంది దివ్య. మరొకవైపు విక్రమ్ కారులో పాటలు పెట్టుకుని దివ్యని తెలుసుకుని ఆనందంగా వెళుతూ ఉంటాడు.

 ఇంతలో దేవుడు విక్రమ్ బాబు విజయవాడకు వెళ్లాడు కానీ మనసంతా ఇక్కడే ఉంది అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. మరోవైపు విక్రమ్ నా మీద దివ్య బెంగ పెట్టుకొని ఉంటుందేమో కనీసం చెప్పలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అవును దేవుడు చెప్పిన ప్రకారం ఈపాటికి ఫోన్లు రావాలి కదా ఇంకా ఫోన్ రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఏమైంది తనకి ఎందుకు ఫోన్ చేయడం లేదు నా మీద అలిగిందా లేకుంటే నా మీద కోపం వచ్చిందా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు విక్రమ్. అప్పుడు దేవుడికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ దేవుడు?  దివ్య ఇంకా ఫోన్ చేయడం లేదు ఏంటి అనగా మీరు వెళ్లి పావుగంటే కదా బాబు అయిండేది మరి ఎందుకు అలా బీపీ పెంచేసుకొని ఆలోచిస్తారు అని అంటాడు.

కొద్దిసేపు ఆగండి బాబు దివ్య నుంచి మీకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తాయి అనడంతో అంతేనంటావా దేవుడు అనగా అవును అనడంతో సంతోషపడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఇద్దరు ఒకరికొకరు పద్యాలు సామెతలు చెప్పుకుంటూ ఉంటారు. మరొకవైపు వాసుదేవ్ తన బిజినెస్ విషయంలో పార్ట్నర్ షిప్ నందుకీ ఇవ్వడంతో లాస్య తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు వాసుదేవ్ నీ కేఫ్ విషయంలో నీ వెనుక బ్యాక్ బోన్ లా నిలబడి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన నీ భార్య తులసి ఈ విషయంలో కూడా నీ వెనకాలే ఉండి నిన్ను ఒక మంచి పైకి తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను అని అంటాడు వాసుదేవ్.

అప్పుడు లాస్య మధ్యలో కలుగజేసుకొని తులసీ తన జాబులో బిజీగా ఉంటుంది ఈ విషయంలో నేను నందుకు సపోర్ట్ గా ఉంటాను అని అనగా నేను కేవలం ఈ డీల్ తులసి కోసం మాత్రమే అనడంతో లాస్య అవమానంగా ఫీల్ అవుతుంది. అప్పుడు టైం అవుతోంది బయలుదేరుదామా అని వాసుదేవ్ వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో లాస్య నందు చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని నా కష్టానికి తగ్గ ఫలితం దక్కబోతోంది అంటూ ఆ ఫైల్ ని చూసి తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు నందు లాస్య కి షాక్ ఇస్తూ ఈ ఒక అబద్ధంతో గెలిచిన ఈ ప్రాజెక్టు డీల్ నాకు అవసరం లేదు నిజం చెప్పేద్దామని అనుకుంటున్నాను అనడంతో లాస్య షాక్ అవుతుంది. రెండు రోజులు తులసి నా భార్య స్థానంలో ఉంటేనే గింజుకున్నావు.

ఈ డీల్ ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ తులసి నా భార్యగా ఉండాలి అని అంటాడు నందు. నీ మనసులో మాట చెబుతున్నావా అనడంతో తులసి నా భార్య అనుకునే దేవ్ నాకు ఈ డీల్ ఇచ్చాడు అని అంటాడు నందు. అప్పుడు లాస్య నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ రెండు రోజులు తులసీతో ఎంజాయ్ చేసి ఇప్పుడు చివరి నిమిషంల్ప్ ఈ మాట మాట్లాడుతున్నావా అని అంటుంది. తప్పుగా ఆలోచిస్తున్నావు నందు చేతికీ అందిన అదృష్టాన్ని వదులుకుంటున్నావు అని అంటుంది. మరొకవైపు దివ్య ప్రియ కోసం హాస్పిటల్ ముందు సేమియానా వేసి న్యాయం కావాలి అని హాస్పిటల్స్ సిబ్బందితో గొడవ చేయాలి అని అనుకుంటూ ఉండగా, ఇది చూసిన దేవుడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది దివ్యమ్మ ఏంటి విక్రం బాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంత నానా రచ్చ చేస్తుందా అనుకొని తప్పుగా అపార్థం చేసుకుంటాడు.

 అప్పుడు దివ్య అసలు విషయం చెప్పడంతో దేవుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు అసలు విషయాన్నే చెప్పి అక్కడున్న వారందరిని రెచ్చ కొడుతూ ఉంటుంది దివ్య. ఒక హాస్పిటల్ ఎండి కొడుకు అనే కదా ప్రియా కి అన్యాయం చేయాలని చూస్తున్నాడు మనం ప్రియా కి ఎలా అయినా న్యాయం చేయాలి అని అందరితో మాట్లాడుతూ ఉంటుంది దివ్య. అప్పుడు దేవుడు ఒకవైపు అన్నతో ప్రేమాయణం నడుపుతూనే తమ్ముడితో యుద్ధానికి దిగుతోంది అనుకుంటూ ఉంటాడు. ఈ గొడవ ఇంకా ఎంత పెద్ద దవుతుందో అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఈ విషయం కనుక విక్రమ్ బాబుకీ చెబితే ఉన్న ఫలంగా ఇక్కడికి వచ్చేస్తాడు.

ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకుంటుండగా ఇంతలోనే విక్రమ్ ఫోన్ చేయడంతో పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. చెప్పండి బాబు అనగా ఒరేయ్ దేవుడు నువ్వు చెప్పినట్టుగా పొద్దున ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పటివరకు దివ్యా నాకు ఫోన్ చేయలేదు అసలు ఏం జరుగుతోంది రా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది ఇక నాకు టెన్షన్ గా ఉంది అని అంటాడు విక్రమ్. చూడండి చిన్న బాబు దివ్యమ్మ ఫోన్ కోసం ఎదురు చూడొద్దు కార్లో పడుకుని నిద్రపోండి అనడంతో దివ్యమ్మ ఇప్పుడు ఫోన్ చేసేలా లేదు ఫుల్ బిజీగా ఉంది అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు దేవుడు. ఏం జరుగుతుంది అనగా అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు దేవుడు. మరోవైపు దివ్య వాళ్లు న్యాయం జరగాలి అని గొడవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాసుదేవ్ వాళ్లు బయలుదేరుతారు.

అప్పుడు లాస్య నందు తన మూడు మార్చుకునేలా ఉన్నాడు వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ ఎమోషనల్ గా బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాసుదేవ్ నందు చేతులు పట్టుకొని మ్యారేజ్ డే రోజు నువ్వు ఇచ్చిన స్పీచ్ చాలా ఎమోషనల్ గా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ధైర్యం నీకు ఉంది అంటూ నందు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు వాసుదేవ్. ఇప్పుడు వాసుదేవాళ్ళు బయలుదేరుతుండగా నందు గిల్టీగా ఫీల్ అవుతూ నీ దగ్గర ఒక నిజం దాచాను వాసుదేవ్.

తులసి నేను విడాకులు తీసుకొని విడిపోయాము భార్యాభర్తలము కాదు రెండేళ్ల కిందటమే విడాకులు తీసుకుని నేను లాస్యని పెళ్లి చేసుకున్నాను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కేవలం నీ బిజినెస్ డీల్ కోసం మాత్రమే నేను తులసి ఇద్దరు భార్యాభర్తలుగా నటించాము ఇందులో తులసీది ఎటువంటి తప్పులేదు నేను అడగడం వల్లే తాను ఇలా నటించడానికి ఒప్పుకుంది అనడంతో వాసుదేవ్ షాక్ అవుతాడు.

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?