
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా హైదరాబాద్ లో అత్యంత గ్రాండ్ గా లాంచ్ అయింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను.. కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నాడు. చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఈసినిమాలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేయబోతోంది. ఇక ఈసినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.. ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. దాని కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు టీమ్.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయంటే.. తారక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయట. పోరాట సన్నివేశాలలో.. రక్తం ఏరులై పారబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సెట్స్ నుంచి రిలీజ్ అయిన బ్లడ్ ట్యాంకర్ ఫోటోతో .. ఈసినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుస్తోంది. ఎన్టీఆర్30 సెట్స్ నుంచి లీక్ అయిన ఈ ఫోటోలో.. ట్యాంకర్ నిండా నీరు కాకుండా నకిలీ రక్తంతో నిండి ఉంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ డూప్ బ్లడ్ నువాడబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ రక్తపు ట్యాంకర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తారక్ ఫ్యాన్స్ ఇక బ్లడ్ బాత్ గ్యారంటూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈసినిమా ఆంధ్రాలో కోస్తా భూముల మరియు వాటర్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 నుంచి యాక్షన్ సీన్స్ పై రకరకాల ఊహా గానాలు ఫ్యాన్స్ మధ్య తిరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే .. ఫస్ట్ షెడ్యూల్ లోనే క్రేజీ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా పై అంచనాలు పెంచేశాడు దర్శకుడు.
ఎన్టీఆర్ అంటేనే యాక్షన్ సినిమాలకు బ్రాండ్.. ఆయనలో ఎనర్జీని ఉపయోగించుకునే డైరెక్టర్ దొరకాలే కాని.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ అవ్వాల్సిందే. అయితే ఈ విషయంలో కొరటాల చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుననాడు. ఆయనకు ఆల్ రెడీ జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ తో తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అది దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. మరీ ముఖ్యంగా ఈసినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఫిల్మ్ అని ఓపెనింగ్ రోజే ప్రకటించాడు దర్శకుడు. ఈలెక్కన ఎన్టీఆర్ తో కొరటాల ఎటువంటి ఫీట్లు చేయించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
తారక్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్.. ఆయన సినిమా టాలీవుడ్ నే కాదు.. ఇండియాతో పాటు.. హాలీవుడ్ వరకూ వెళ్ళగలగాలి. అందుకోసం.. ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు ఈ రక్తపు ట్యాంకర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తో విలన్ గా తలపడబోయేది బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఇక వీరిద్దరి మద్య పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయా అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతోంది. అంతే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశపరచనంటూ.. కొరటాల శివ ప్రకటించారు.