Guppedantha Manasu: ధర్మరాజు నిజస్వరూపం తెలుసుకున్న రిషి.. గదిలో ఇరుక్కుపోయిన వసుధార, రిషి?

Published : Mar 25, 2023, 07:10 AM IST
Guppedantha Manasu: ధర్మరాజు నిజస్వరూపం తెలుసుకున్న రిషి.. గదిలో ఇరుక్కుపోయిన వసుధార, రిషి?

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర,రిషి టెన్షన్ గా ఆ సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ గది తలుపులు తెరిచి ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయినా కీస్ నా దగ్గర ఉన్నాయి మరి డోర్స్ ఎవరు తీశారు ఇది ఎవరి పని అయ్యుంటుంది అని అంటాడు మహేంద్ర. అయినా దిద్దిన పేపర్స్ తీసుకొని వెళ్లి వాళ్ళం చేస్తారు అనగా ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మన కాలేజీ పరువు పోతుంది కదా డాడ్ అని అంటాడు. అందరూ కలిసి లోపలికి వెళ్ళగా అక్కడ వసుధార సార్ మూడు బండల్స్ మిస్ అయ్యాయి అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు.

ఒక పేపర్ మిస్సయిన మన కాలేజీకి బ్యాడ్ నేమే కదా అని అంటాడు రిషి. అప్పుడు జగతి చేతిలో ఉన్న కీస్ కి సబ్బు అంటుకోవడంతో అవును సార్ దీనికి ఎవరో సబ్బు అంటించారు అనగా ఈ పని ఎవరు చేశారు నాకు తెలుసు వసుధార వెళ్దాం పద అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్తాడు. మరొకవైపు ధర్మరాజు ఫుల్ గా మందు తాగుతూ ఆ మూడు బండల్స్ ని చూసి సంతోష పడుతూ ఉంటాడు. ఇంతలోనే ఫోన్ రావడంతో నమస్తే సార్ డిబిఎస్టి కాలేజ్ పని అయిపోయింది పది అడుగుల కింద పడిపోతుంది అని సంతోషంగా నవ్వుతూ మాట్లాడతాడు. ఇంతలోనే వసుధార రిషి అక్కడికి వస్తారు.


ఇప్పుడు వెళ్దాం పద వసుధార అనగా అప్పుడు బ్యాగు తీసుకుని రావడంతో ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ అవసరమా అనగా సార్ ఇందులో అవసరమైన వస్తువులు ఉన్నాయి అంటూ గ్లౌజులు మాస్క్ తాడు కట్టింగ్ బ్లేడ్ అన్ని చూపించడంతో నువ్వు ప్రొఫెషనల్ దొంగవా అని అనడంతో సార్ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార మాటలకు రిషి ఆశ్చర్యపోతాడు.  అప్పుడు వసుధర ప్రొఫెషనల్ దొంగలాగా అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉండగా రిషి ఆశ్చర్యపోతాడు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి అనడంతో మనం వెళ్దామా లేదా ఇక్కడే ఉందామా అనడంతో సరే వెళ్దాం పదండి సార్ అని అంటుంది.

 ఇప్పుడు రిషి జోబీలో చేతులు పెట్టుకుని వెళ్తుండగా ఏంటి సార్ మీరు కాలేజీకి వెళ్తున్నారా దొంగతనానికి వచ్చాము కొంచెం చూసుకొని వెళ్లాలి కదా అని అంటుంది. అప్పుడు వసుధార దొంగ వెళ్ళినట్టుగా వెళ్లడంతో నేను ఇప్పుడు అలా రావాలా అనడంతో అవును సార్ ఇప్పుడు మనకు బండల్స్ కావాలంటే ఇలా వెళ్లాల్సిందే అని అంటుంది. తర్వాత ఇద్దరు కలిసి దొంగచాటుగా వెళ్లగా అప్పుడు గది తలుపులు తీయండి సార్ అనడంతో ఎలా తీయాలి అనగా తలలో పిన్నీసు తీసి గది తలుపులు తెరవాలి అని చూడగా అవి రాకపోవడంతో రావట్లేదు సార్ అని అంటుంది వసుధార.

సార్ సినిమాలో ఇలా తీస్తే వచ్చేది సార్ అనగా రిషి ఇది సినిమా కాదు రియల్ జీవితం అని అంటాడు. ఏదో ఒకటి చెయ్ అని దొంగలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ధర్మరాజు గది తలుపులు తీయడంతో వసుధర రిషి దొంగ చాటుగా లోపలికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజు టాయిలెట్ పోసుకుని లోపలికి రావడంతో రిషి వసు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ధర్మరాజు రూంలో సీక్రెట్ గా వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత గదిలో పేపర్స్ లేకపోవడంతో మరొక గదికి వెళ్లడానికి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తుండగా హలో రిషి సార్ అనడంతో ఇద్దరు దొరికిపోయాము అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు.

అప్పుడు ధర్మరాజు వైపు చూడగా ధర్మరాజు తాగిన మైకంలో చేతిలోకి బండల్స్ తీసుకొని సంతోషపడుతూ మీ కాలేజీ పరువుపోతుంది మీ కాలేజీ పరువు పోతే ఎవరికో ఆనందం అంట అంటూ తాగిన మైకంలో నిజాలు అన్ని బయటకు కక్కేస్తూ ఉంటాడు. అప్పుడు ధర్మరాజు తాగిన మైకంలో ఒక్కొక్కటిగా నిజాలు చెబుతూ ఉండగా అసలు నిజ స్వరూపం తెలుసుకున్న రిషి వసుధారలు షాక్ అవుతారు. ఆ తర్వాత ధర్మరాజు వసుధార వాళ్ళ వైపు వస్తుండడంతో ఇద్దరు వెళ్లి ఒక గదిలో డోర్ కట్టడం వెనక దాక్కుంటారు. అప్పుడు ధర్మరాజు అక్కడికి వచ్చి ఏంటి గది తలుపులు తెరిచి ఉన్నాయి అనుకుని ఆ గది తలుపులు క్లోజ్ చేయడంతో వస ధర రిషి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు.

 సర్ గదికి తాళం వేశాడు ఇద్దరు ఇరుక్కుపోయాం ఇప్పుడు ఏం చేయాలి అని వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడు ఎప్పుడొస్తాడు అంతవరకు మనిద్దరం ఇక్కడే ఉండాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి సెటైర్లు వేయడంతో ఇప్పుడు ఇలాంటివి అవసరమా సార్ అని అంటుంది. అప్పుడు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంతటితో చాలు వెళ్లి పడుకుందాం అని లోపలికి వెళ్ళగా వసుధార ధర్మరాజు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?