తాతయ్య అడిగిందే తడవు 990 కిమీలు నడిపారు: హరికృష్ణపై కల్యాణ్ రామ్

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 4:39 PM IST
Highlights

''మా తాత(ఎన్టీఆర్) ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి రాజకీయంగా ఒంటరిగా మారిన సమయంలో మా నాన్న(హరికృష్ణ) ఆయనకు అండగా నిలబడ్డారని'' హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. నాన్న కు ప్రేమతో ఆడియో పంక్షన్ లో హరికృష్ణ తనకు తండ్రితో ఉన్న అనుబంధాన్నే కాదు ఆయనకు తాతతో వున్న అనుబంధం గురించి కూడా గుర్తుచేశారు.

''మా తాత(ఎన్టీఆర్) ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి రాజకీయంగా ఒంటరిగా మారిన సమయంలో మా నాన్న(హరికృష్ణ) ఆయనకు అండగా నిలబడ్డారని'' హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. నాన్న కు ప్రేమతో ఆడియో పంక్షన్ లో హరికృష్ణ తనకు తండ్రితో ఉన్న అనుబంధాన్నే కాదు ఆయనకు తాతతో వున్న అనుబంధం గురించి కూడా గుర్తుచేశారు.

 ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి రాజకీయ సంక్షోబాన్ని ఎదుర్కున్న సమయంలో హరికృష్ణ ఒక్కరే ఆయనకు అండగా నిలిచారని కళ్యాణ్ రామ్ అన్నారు. అప్పటి సంఘటనను గురించి కళ్యాణ్ రామ్ ఇలా వివరించారు. '' పదవిని కోల్పోయిన మా తాతయ్య(ఎన్టీఆర్) డిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వస్తూ నాన్నగారికి ఫోన్ చేశారు. నేను హైదరాబాద్ కు వస్తున్నాను చైతన్య రథం తీసుకురమ్మని చెప్పారు.  అయితే ఆ సమయంలో నాన్న ఎక్కడో హైదరాబాద్ కు దూరంగా దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అయినప్పటికి రాత్రంతా  నిద్రాహారాలు మాని 900 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయానికల్లా హైదరాబాద్ కు చేరుకున్నారు. నేరుగా స్టేషన్ కు వెళ్లి తాతగారికి రిసీవ్ చేసుకున్నారు'' అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

 ఇంత ఎక్కువగా హరికృష్ణ తండ్రిని ప్రేమించేవారని కళ్యాణ్ రామ్ తన తండ్రికి, తాతకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  హరికృష్ణ ఆ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలను ఇప్పుడు హరికృష్ణ మృతి సందర్భంగా నందమూరి అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

స్నేహానికి విలువ ఇచ్చి.. తారక్ తోడుగా కొడాలి నాని

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

రెండు సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే హరికృష్ణ ఇంటికొచ్చా: గవర్నర్

హరికృష్ణ లగ్న పత్రిక

హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన కేసీఆర్
 

click me!