బింబిసార2 కి మహూర్తం ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్

Published : Dec 13, 2023, 12:29 PM ISTUpdated : Dec 13, 2023, 02:52 PM IST
బింబిసార2 కి మహూర్తం ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్

సారాంశం

ప్రస్తుతం డెవిల్ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. డిఫరెంట్ కాన్సెప్ట్ లో తో దూసుకుపోతున్న ఈ హీరో.. తనకు బ్రేక్ ఇచ్చిన బింబిసార మూవీ సీక్వెల్ తో రాబోతున్నాడు.   

రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తున్నాడు నందమూరి మీరో కళ్యాణ్ రామ్. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో దూసుకుపోతున్నాడు. వరుస పరాజాయాల తరువాత  వశిష్ట దర్శకత్వంలో వచ్చిన బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కు బాగా కలిసి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈమూవీ ప్రభావంతో దర్శకుడు వశిష్టకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఇక ఈ సూపర్ హీట్ మూవీకి త్వరలో సీక్వెల్ కూడా చేయాలని భావిస్తున్నారు టీమ్. 

నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ అనే  భారీ సినిమాతో ముస్తాబవుతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాను సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సినిమా బింబిసార నే అంటున్నాడు కళ్యాణ్ రామ్. ఓ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని మెప్పించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా అప్డేట్ అందించాడు. 

హరీష్ శంకర్ తో అల్లు అర్జున్ అఫీషియల్... కాని ట్విస్ట్ ఏంటంటే..?

బింబిసార సినిమాపై ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికిముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు హీరో.  వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా కళ్యాణ్ రామ్  తెలిపాడు. దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి అప్డేట్ నే అందించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తాను నటించిన డెవిల్ సినిమా  ఈ డిసెంబర్ 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు