నితిన్ 'ఎక్స్ట్రా' మూవీకి స్టార్ డైరెక్టర్ సాయం.. అయినా ఫలితం లేకుండా పోయింది ?

Published : Dec 13, 2023, 11:24 AM IST
నితిన్ 'ఎక్స్ట్రా' మూవీకి స్టార్ డైరెక్టర్ సాయం.. అయినా ఫలితం లేకుండా పోయింది ?

సారాంశం

రిలీజ్ కి ముందు నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని సురేందర్ రెడ్డికి చూపించారట. ఫైనల్ అవుట్ పుట్ కోసం ఎక్స్ట్రా చిత్ర యూనిట్ సురేందర్ రెడ్డి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం పై అటు నితిన్, ఇటు వక్కంతం వంశీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 

ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్పితే రచయితగా వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచారు. నితిన్ తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. అదేంటంటే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి ఒక స్టార్ డైరెక్టర్ సాయం చేశారట. ఆయన ఎవరో కాదు వక్కంతం వంశీకి బాగా క్లోజ్ అయిన సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డికి వక్కంతం వంశితో మాత్రమే కాదు నితిన్ ఫ్యామిలీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. 

రిలీజ్ కి ముందు నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని సురేందర్ రెడ్డికి చూపించారట. ఫైనల్ అవుట్ పుట్ కోసం ఎక్స్ట్రా చిత్ర యూనిట్ సురేందర్ రెడ్డి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనవసర సన్నివేశాలని కట్ చేయాలనీ సురేందర్ రెడ్డి సూచించినట్లు టాక్. వెంకీ కుడుముల లాంటి దర్శకుల అభిప్రాయం కూడా నితిన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: డబ్బు కోసమే ఆ మూవీలో నటించా, ఆమెతో రొమాంటిక్ సీన్ తప్పు కాదు..ఆస్తుల వివరాలు బయటపెట్టిన అలీ రెజా

ఎంత మంది సలహాలు పాటించినా ఎక్స్ట్రా చిత్రాన్ని ఏ అంశమూ కాపాడలేకపోయింది. నితిన్ పెర్ఫామెన్స్, కొన్ని కామెడీ సీన్స్ కి మాత్రమే మంచి రెస్పాన్స్ వచ్చింది. నితిన్ కెరీర్ లో మరో డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తోంది. పెట్టుబడిలో 50 శాతం అయినా ఈ మూవీ రికవరీ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్న. వక్కంతం వంశీ అందించిన కథలతోనే సురేందర్ రెడ్డి రేసుగుర్రం, కిక్ లాంటి సూపర్ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం వీళ్లిద్దరి మ్యాజిక్ అంతగా పనిచేయడం లేదు. ఏజెంట్ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ