సంక్రాంతికి రానున్న బాలకృష్ణ 102వ చిత్రం టైటిల్ ఖరారు

Published : Oct 28, 2017, 07:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సంక్రాంతికి రానున్న బాలకృష్ణ 102వ చిత్రం టైటిల్ ఖరారు

సారాంశం

కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 102వ సినిమా సి.,కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు "జైసింహ" టైటిల్ ఖరారు నవంబర్ 1న ఫస్ట్ లుక్, సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2018న విడుదల చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ నిర్ణయించారు.    

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. నవంబర్ 1న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో "మహా ధర్నా" సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇదే షెడ్యూల్ లో బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రోమాంటిక్ సాంగ్ తోపాటు, బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం" అన్నారు.

 

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ,  ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి,  ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ