పవన్ కళ్యాణ్ పై వర్మ దారుణమైన వీడియో

Published : Oct 28, 2017, 02:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పవన్ కళ్యాణ్ పై వర్మ దారుణమైన వీడియో

సారాంశం

పవన్ కళ్యాణ్ పై వీలైనప్పుడల్లా సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వచ్చిన విమర్శలకు స్పందించిన వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ పై ఓ సెటైరికల్ వీడియోను ఎఫ్.బి.లో పోస్ట్ చేసిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయడం చాలా తగ్గించేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడంతో.. వర్మకు మళ్లీ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు.

 

గతంలో ఎప్పుడో ఓ రాజకీయ సభలో పవన్ మాట్లాడిన మాటకు.... టాలీవుడ్ స్టార్ల సీన్లు జోడిస్తూ సెటైరిక్ గా ఈ వీడియో తయారు చేశారు. ఈ వీడియో చాలా దారుణంగా ఉంది, అదే సమయంలో ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది.

 

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని గతంలో ఓ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. ఆయన వ్యాఖ్య మీద ఈ సెటైరిక్ వీడియో తయారు చేశారు. ఇది అసత్యాన్ని అపవిత్రం చేయడమే ఇది స‌త్యాన్ని అప‌విత్రం చేయ‌డ‌మే, అది విన్నవారి వేదన అలా ఉంటుంది అంటూ వర్మ వ్యాఖ్యానించారు.

 

వర్మ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రాత్రి ఈ వీడియో పోస్టు చేయగా ఇప్పటికే లక్షల మంది దీన్ని వీక్షించారు. వర్మ పోస్టు చేసిన వీడియో మీరూ చూడండి.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు